EG: గండ్రవాని గూడెం గ్రామం శివారు ప్రాంతాలలో సారా బట్టీలపై ఆదివారం దాడులు చేశామని సీఐ కన్నపరాజు మీడియాకు తెలిపారు. సారా తయారీకి ఉపయోగించే 10 వేల లీటర్ల బెల్లం ఊటను, సారా బట్టీ లను ధ్వంసం చేశామని తెలిపారు. సారా తయారీకి ఉపయోగించే పాత్రలు, ప్లాస్టిక్ డ్రమ్ము లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సారా తయారు చేసినా, అమ్మినా చర్యలు తప్పవని హెచ్చరించారు.