CTR: ఈనెల 29న రొంపిచెర్లలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ చిచ్చిలి పురుషోత్తంరెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్నట్లు ఎంపీడీవో మధుసూదన్ రెడ్డి సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల పరిషత్ కార్యాలయంలో జరిగే సర్వసభ్య సమావేశానికి అన్ని శాఖల అధికారులు అభివృద్ధి పనులకు సంబంధించిన నివేదికల తీసుకొని రావాలని కోరారు.