CTR: శాంతిపురం మండలం కూతిగానిపల్లె శ్రీపరమహంస యోగానంద విద్యాలయంలో అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌పై శిక్షణ ఇవ్వనున్నట్లు డీఈవో వరలక్ష్మి, జిల్లా సైన్స్ అధికారి ఆర్వీ రమణ తెలిపారు. నేటినుంచి మూడు రోజులపాటు శిక్షణ ఉంటుందన్నారు. అన్నమయ్య, అనంతపురం, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, వైఎస్సార్ కడప, నంద్యాల, ప్రకాశం జిల్లాలకు చెందినవారు పాల్గొంటారని చెప్పారు.