దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ మదుపర్లు కొనుగోళ్లు చేయటంతో సూచీలు లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 429 పాయింట్లు ఎగబాకి 79,832 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 82 పాయింట్ల లాభంతో 24,263 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 84.08 వద్ద ప్రారంభమైంది.