TG: జన్వాడ ఫామ్‌హౌజ్ రేవ్ పార్టీలో నిందితుడు రాజ్ పాకాల హైకోర్టును ఆశ్రయించాడు. తనను అక్రమంగా అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని.. అరెస్ట్ చేయకుండా పోలీసులను ఆదేశించాలని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాడు. కాగా, ఇవాళ ఆయన పోలీసుల విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే రాజ్ పాకాల అజ్ఞాతంలో ఉండటంతో అతని ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు.