AP: రాష్ట్ర హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తులు ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. జస్టిస్ చల్లా గుణరంజన్, జస్టిస్ మహేశ్వరరావు కుంచం, జస్టిస్ తూట చంద్ర ధనశేఖర్లు ప్రమాణం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ వారితో ప్రమాణస్వీకారం చేయించారు. వీరి నియామకంతో అదనపు న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది. కాగా, ఖాళీగా ఉన్న మరో 8 పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు సమాచారం.