EG: ఎన్డీఏ కూటమి గత ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను కచ్చితంగా అమలు చేస్తుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. సోమవారం రాజమండ్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సూపర్ సిక్స్ పథకాలలో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ హామీని ఈనెల 31వ తేదీ నుంచి అమలు చేస్తున్నామని వెల్లడించారు.