KDP: ఏపీలో దాదాపు రూ.1,397 కోట్లతో దక్షిణ మధ్య రైల్వే వివిధ స్టేషన్లు అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా కడప రైల్వే స్టేషన్ను రూ.20 కోట్లతో ఆధునీకీకరించనున్నారు. అంతర్జాతీయ హంగులతో దీనిని తీర్చిదిద్దనున్నారు. సంబంధిత పనులకు ప్రధాని మోదీ ఇటీవల వర్చువల్గా శంకుస్థాపన చేయడంతో పనులు జోరుగా జరుగుతున్నాయి.