ఆలయంలో ఉచితంగా కొబ్బరికాయ కొట్టే సంప్రదాయం కూడా ప్రస్తుతం ఇరవై రూపాయలు ఇస్తే కానీ జరగడం లేదు. అవును ఈ సంఘటన ఎక్కడో కాదు. ఏపీలోని విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో చోటుచేసుకుంది. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడ(Vijayawada) కనకదుర్గమ్మ గుడి(Kanakadurgamma temple)లో కొబ్బరికాయ కొట్టాలంటే అక్కడున్న సిబ్బంది చేతిలో ఇరవై రూపాయిలు పెట్టాల్సిందే. అవును మీరు విన్నది నిజమే. ప్రస్తుతం ఆలయంలో దర్శనం కోసం వచ్చిన భక్తుల నుంచి వసూళ్ల దందా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కనకదుర్గమ్మ గుడిలో భక్తుల వద్ద నుంచి కొబ్బరికాయ కొట్టడానికి కాంట్రాక్టర్ 20 రూపాయిలు వసూలు చేస్తున్నారు. అందుకోసం వారానికి లక్షా ఎనిమిది వేల రూపాయలకు టెండర్ పాడుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి వచ్చిన భక్తుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మరోవైపు ఆలయం దగ్గర కొబ్బరి కాయ కొనాలంటే రూ.30 నుంచి రూ.40 వసూలు చేస్తున్నారు. అది కాకుండా ఇప్పుడు కొబ్బరికాయ ఆలయంలో కొట్టాలంటే కూడా డబ్బులు ఇవ్వడమెంటని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గతంలో కనకదుర్గమ్మ ఆలయ పరిధిలో అన్నదానం కూడా నిర్వహించే వారని ఇప్పుడు అది కూడా ఉండటం లేదని పలువురు భక్తులు(devotees) వాపోతున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సింది పోయి తమ నుంచే దోపిడీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే తిరుపతి ఆలయం నుంచి భక్తుల నుంచి వచ్చిన సొమ్మును అధికారులు వారి అవసరాలకు వినియోగించుకుంటున్నారనే విమర్శలు సైతం గతంలో వెల్లువెత్తాయి.