»Women Professors Pathan Movie Song Dance With Girls Shah Rukh Khan Reacts To Tweet
Viral Video: అమ్మాయిలతో కలిసి డాన్స్ చేసిన ప్రొఫెసర్లు…షారుఖ్ ఖాన్ రియాక్ట్
పఠాన్ మూవీలో ఓ పాఠకు డాన్స్ చేసిన మహిళా ప్రొఫెసర్ల వైరల్ డాన్స్ వీడియోను చూసిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ చూసి రియాక్ట్ అయ్యారు. అలాంటి ఉపాధ్యాయులు, ఫ్రొఫెసర్లు దొరకడం అదృష్టమని ట్విట్టర్ వేదికగా ఆ వీడియోను జత చేస్తూ వెల్లడించారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మహిళా ప్రొఫెసర్ల(women Professors) డాన్స్ వీడియోను చూసిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) స్పందించారు. మనకు విద్యను నేర్పించే, మనతో సరదాగా గడిపే ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు మనకు ఉండటం ఎంతో అదృష్టమని షారూఖాన్ అన్నారు. ఈ క్రమంలో ఆ డాన్స్ వీడియాను జత చేస్తూ ట్విట్టర్(twitter) వేదికగా పోస్ట్ చేసి వారందరూ విద్యా రాక్‌స్టార్స్ అని పేర్కొన్నారు. ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్, విద్యార్థుల డ్యాన్స్ వీడియోపై షారూఖ్ ఖాన్ స్పందనపై మరికొంత మంది అభిమానులు మద్దతు తెలుపుతూ కామెంట్లు(comments) చేస్తున్నారు. లవ్ యూ షారూఖ్ అంటూ పలు రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు.
How lucky to have teachers and professors who can teach us and have fun with us also. Educational Rockstars all of them!! pic.twitter.com/o94F1cVcTV
ఇటీవల ఢిల్లీ(delhi)లోని ఓ ఫ్లాష్ మాబ్(flash mob)లో భాగంగా కాలేజ్ అమ్మాయిలు డాన్స్(dance) చేస్తున్న క్రేజీ వీడియో వెలుగులోకి వచ్చింది. అయితే వీడియోలో అమ్మాయిలు హుక్ స్టెప్ వేస్తూ జూమ్ జో పఠాన్ పాఠకు డాన్స్ చేశారు. ఆ క్రమంలో చీరలు కట్టుకున్న మహిళా ప్రొఫెసర్లు(Professors) కూడా వారితో పాటు జాయిన్ అయి డాన్స్ చేశారు. దీంతో అక్కడ ఉన్న విద్యార్థినులు అందరూ ఒక్కసారిగా కేకలు వేశారు. ప్రొఫెసర్లు డాన్స్ చేస్తున్న క్రమంలో క్లాప్స్ కొడుతూ సందడి చేశారు. ఈ వీడియోను డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్, జీసస్ & మేరీ కాలేజీ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ అధికారిక ఇన్ స్టా(Instagram) పేజీలో వీడియోను పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
షారుఖ్ ఖాన్ ఇటీవల యాక్ట్ చేసిన పఠాన్ మూవీ భారీ విజయం సాధించింది. దీంతో అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగిందని చెప్పవచ్చు. చాలా రోజుల తర్వాత షారూఖ్ నుంచి వచ్చిన పఠాన్ మూవీ సక్సెస్ సాధించడంతో తన అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తన తర్వాత చిత్రాలైన జవాన్, డంకీని చూడటానికి అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.