లైంగికంగా వేధిస్తున్నాడంటూ మహిళా రెజ్లర్లు.. జాతీయ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూష్ సింగ్(Brij Bhushan) పై ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా తనపై వచ్చిన ఆరోపణలకు ఆయన స్పందించారు. తనపై వస్తున్న లైంగిక ఆరోపణలను ఉద్దేశిస్తూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. మిత్రులారా అంటూ మొదలుపెట్టిన వీడియోని ఆయన షేర్ చేయగా అది వైరల్ గా మారింది.
తాను నిస్సహాయకుడిగా మారిన రోజు… చావును కోరకోనున్నట్లు ఆయన వెల్లడించారు. మిత్రులారా.. నేను ఓడానా లేక గెలిచానా అని ఆత్మ విమర్శ చేసుకున్న రోజు.. తనలో పోరాడేందుకు శక్తి లేదని గ్రహించిన రోజు.. తనను ఎవరూ ఆదుకోలేరని గ్రహించిన రోజు.. అప్పుడు మరణాన్నే ఆశ్రయిస్తానని, ఎందుకంటే అలాంటి జీవితాన్ని తాను కోరుకోవడం లేదని బ్రిజ్ భూషణ్ అన్నారు.
కాగా, భారత స్టార్ రెజ్లర్లు వినోశ్ ఫోగట్, సాక్షీ మాలిక్, భజరంగ్ పూనియాతో పాటు ఇతర మేటి అథ్లెట్లు .. బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో రెండోసారి ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. బ్రిజ్‌పై చర్యలు తీసుకునే వరకు పోరాటాన్ని ఆపేది లేదని రెజ్లర్లు స్పష్టం చేశారు. బ్రిజ్‌పై వేసిన కమిటీ తన రిపోర్టను తయారు చేసింది. కానీ ఇప్పటి వరకు ఆ రిపోర్టును బయటకు రిలీజ్ చేయలేదు.
VIDEO | WFI President Brij Bhushan Sharan Singh reacts to the sexual harassment charges against him. pic.twitter.com/HOdwVCWCIa