»If Found Guilty Of Harrassment Assault Will Be Hanged Brij Bhushan
Brij Bhushan: లైంగిక ఆరోపణ రుజువైతే ఉరేసుకుంటా: బ్రిజ్ భూషణ్
ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan) ఆదివారం ఓ వీడియో సందేశాన్ని రిలీజ్(Video Release) చేశారు. తనపై ఒక్క లైంగిక ఆరోపణ రుజువైనా తాను ఉరేసుకుంటానని ప్రకటించారు.
తనపై ఒక్క లైంగిక ఆరోపణ రుజువైనా తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటానని డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan) స్పష్టం చేశారు. గత కొన్ని రోజుల నుంచి ఆయనపై రెజ్లర్లు లైంగిక వేధింపుల(Harrassment) ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆ విషయంలో అతడ్ని అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలంటూ రెజ్లర్లు(Wrestlers) నిరసన తెలుపుతున్నారు. ఏప్రిల్ 23వ తేది నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు నిరసన తెలుపుతున్నప్పటికీ కొందరు మాత్రమే వారికి మద్దతు ప్రకటిస్తున్నారు.
తాజాగా నేడు రెజ్లర్ల(Wrestlers) కు మద్ధతుగా రైతులు నిలిచారు. హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో రైతులు చేరుకుని రెజ్లర్లకు మద్దతు తెలిపారు. రైతులు భారీ సంఖ్యలో తరలి రావడంతో పెద్ద ఎత్తున ఢిల్లీ పోలీసులు వారిని మోహరించారు. రెజ్లర్లు మీడియా ముందుకు వచ్చి తమకు జరిగిన అవమానాలను, లైంగిక వేధింపులను తెలిపారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan) ఆదివారం ఓ వీడియో సందేశాన్ని రిలీజ్(Video Release) చేశారు. తనపై ఒక్క లైంగిక ఆరోపణ రుజువైనా తాను ఉరేసుకుంటానని ప్రకటించారు. తాను అన్ని విషయాలను ఓపెన్ గా చెప్పలేనని, ఆరోపణల నేపథ్యంలో తనపై కేసు నమోదైందని, ఢిల్లీ పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. తనపై వస్తున్న ఆరోపణలను ధృవీకరించే సాక్ష్యాలను రెజ్లర్లు (Wrestlers) సమర్పించాలని ఆయన ఛాలెంజ్ విసిరారు. ఆందోళన చేస్తున్న ఐదు మంది రెజ్లర్లను వదిలేసి మిగిలిన రెజ్లర్లను అడిగితే తాను రాముడినో, రావణుడినో తెలుస్తుందన్నారు. తాను వేధిస్తున్నట్లుగా ఒక్క చాటింగ్ కానీ, వీడియో కానీ చూపించాలని రెజ్లర్ల(Wrestlers) కు సవాల్ విసిరారు.