ఏపీ(AP)లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు(Heavy Rain) కురుస్తాయని, పిడుగులు(Thunderbolts) పడే ఛాన్స్ ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ(Weather department) హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో గాలులు(Winds) భీకరంగా వీస్తున్నాయని, ఈ తరుణంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలుంటాయని అమరావతి వాతావరణ కేంద్రం(Amaravati Weather Department) వెల్లడించింది. భారీ ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
శని, ఆది, సోమవారాల్లో ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Weather department) వెల్లడించింది. గాలులు గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని, తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఏపీలోని ఉభయగోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులు(Thunderbolts) పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కూడా పిడుగులతో పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ(Weather department) వెల్లడించింది.