Steel Plant ప్రజల సెంటిమెంట్, కేసీఆర్ కామెంట్ల నేపథ్యంలో మంత్రి అమర్ నాథ్ రియాక్షన్
స్టీల్ ప్లాంట్ ఇష్యూపై ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ (amarnath) స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రజల సెంటిమెంట్ అని తేల్చిచెప్పారు. స్టీల్ ప్లాంట్ (steel plant) అమ్మొద్దనేది తమ ప్రభుత్వ విధానం అని స్పష్టం చేశారు.
minister amarnath:ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag steel plant) గురించి చర్చ జరుగుతోంది. స్టీల్ ప్లాంట్ (steel plant) విక్రయం అంటూ చర్చ నడుస్తోంది. దీనిపై ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ (amarnath) స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రజల సెంటిమెంట్ అని తేల్చిచెప్పారు. స్టీల్ ప్లాంట్ (steel plant) అమ్మొద్దనేది తమ ప్రభుత్వ విధానం అని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ (steel plant) కొనుగోలు అనే ప్రశ్న అర్థరహితం అని చెప్పారు.
స్టీల్ ప్లాంట్ (steel plant) కోసం బిడ్ వేస్తాం అని.. అధికారులను విశాఖ (vizag) కూడా పంపించామని తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr) నుంచి ప్రకటన వచ్చింది. ఇంతలో మంత్రి అమర్ నాథ్ (amarnath) రియాక్ట్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రకటన గురించి తనకు తెలియదని చెప్పారు. స్టీల్ ప్లాంట్ విక్రయానికి సంబంధించి కేసీఆర్ (kcr) స్టాండ్ తెలిశాకే స్పందిస్తానని తెలిపారు. రాజకీయాల కోసం ఎవరో ఏదో మాట్లాడతారని అమర్ నాథ్ (amarnath) కొట్టిపారేశారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.
విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ (steel factory) ప్రైవేటీకరణను తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారు. ఇందులో భాగంగా ఫ్యాక్టరీ నిర్వహణకు కావాల్సిన నిధులు సమకూర్చి.. ఉక్కు ఉత్పత్తులు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. బిడ్డింగ్‌లో పాల్గొనాలని కేసీఆర్ (kcr) నిర్ణయం తీసుకున్నారట. విశాఖ (vizag) వెళ్లి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేసినట్టు తెలిసింది. రెండు రోజుల్లో అధికారుల బృందం విశాఖ (vizag) వెళ్లనుంది. ఈ అంశంపై మంత్రి గుడివాడ అమర్ నాథ్ (amarnath) స్పందిస్తూ.. ఆ ప్రకటన చూడలేదని చెప్పారు.