Virat Kohli Take A Break From White Ball Series In South Africa
భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ (Indian Cricket Star Virat Kohli)కి కార్లు అంటే చాలా ఇష్టం. అతని గ్యారేజీలో చాలా కార్లు ఉంటాయి. అయితే ఇప్పుడు అతను తన కార్లను (Kohli Cars) అమ్మేశాడట. తాను చాలా కార్లను అనుకోకుండా కొనుగోలు చేశానని, అయితే పెద్దగా తిరగకుండానే వాటిని అమ్మేసినట్లు (Kohli sold most of cars) చెప్పాడు ఈ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ (Royal Challengers Bangalore). ఆయన యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ… తనకు ఉన్న కార్లలో చాలా వాటిని అప్పటికి అప్పుడు అనుకొని కొనుగోలు చేసినవే అన్నాడు. కానీ వాటిలో ఎక్కువగా తిరగలేదని, అందుకే ఆ కార్లను ఉంచుకోవడంలో అర్థం లేదని భావించి అమ్మివేసినట్లు చెప్పాడు. కేవలం అవసరమైన కార్లను మాత్రమే అట్టిపెట్టుకున్నట్లు చెప్పాడు. వాటిలోనే ప్రయాణిస్తున్నట్లు వెల్లడించాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫోటో షూట్ సందర్భంగా చిట్ చాట్ లో చెప్పాడు. బోల్డ్ డైరీస్ పేరిట ఆర్సీబీ ఓ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసింది. అందులో యాంకర్ ప్రశ్న అడుగుతాడు… అప్పటికి అప్పుడు అనుకొని కొనుగోలు చేసి, ఉపయోగించని వస్తువులు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నిస్తాడు. దానికి కోహ్లీ స్పందిస్తూ… చూడగానే కొనుగోలు చేసిన వాటిలో కార్లు ఎక్కువగా ఉన్నాయని, చాలా వరకు అప్పటికి అప్పుడు కొన్నవే అని చెప్పాడు. అయితే వాటిలో ప్రయాణించడం చాలా తక్కువ కాబట్టి, కార్లను అమ్మేసినట్లు చెప్పాడు. ప్రస్తుతం ఉన్న వాటిలో తాము ప్రయాణిస్తున్నామన్నాడు. మానసిక పరిణితి వల్లే ఇది సాధ్యమైందని చెప్పాడు. ప్రాక్టికల్ గా మనకు ఏం అవసరమో అది చేయాలన్నారు. క్రిస్టియానో రొనాల్డో, రోజర్ ఫెదరర్, మీరు.. ఒకే టేబుల్ పైన కూర్చుంటే దేని గురించి సంభాషిస్తారని ప్రశ్నించగా…వారిద్దరి మాట్లాడుకుంటుంటే నేను నిశ్శబ్ధంగా కూర్చొని వింటానని చెప్పాడు. క్రీడా దిగ్గజాలను కలిస్తే అద్భుతమని, వారి మాటలు వింటే సరిపోతుందన్నాడు.