»Viral Video Of An Overloaded Tractor Has Left The Internet Worried
overloaded tractor: ఆ ట్రాక్టర్ ఎలా నడుస్తుందో చూస్తే షాకవుతారు
చెరుకు లోడుతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ ను డ్రైవర్ నడుపుతున్నాడు. అయితే ఆ ట్రాక్టర్ లో చెరుకు లోడ్ అధికం కావడంతో ట్రాక్టర్ ముందు ఇంజిన్ భాగం యొక్క ముందు రెండు చక్రాలు నేలను తాకడం లేదు. ఇంజిన్ వెనుక భాగంలోని రెండు పెద్ద చక్రాలు మాత్రమే నేల పైన ఉన్నాయి. అయినప్పటికీ సదరు డ్రైవర్ ఆ ట్రాక్టర్ ను అలాగే తీసుకొని వెళ్తున్నాడు. ఈ వీడియో నెటిజన్ లను షాక్ కు గురి చేసింది.
వాహనాలను ఉపయోగించి ప్రమాదకర విన్యాసాలు (Dangerous maneuver) చేయడం మనం నిత్య జీవితంలో చూస్తూనే ఉంటాం. బైక్ లు, కార్లు తదితర వాహనాలతో రిస్క్ చేస్తుంటారు. మెట్రో నగరాల్లో అర్ధరాత్రులు ఈ విన్యాసాలు చూపరులను ఇబ్బందులకు కూడా గురి చేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా, ఓ ట్రాక్టర్ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఓ ట్రాక్టర్ రన్ అయ్యే విధానం చూసేవారిని అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను హర్ష్ గోయెంకా, ఆనంద్ మహీంద్రాలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
చెరుకు లోడుతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ ను డ్రైవర్ నడుపుతున్నాడు. అయితే ఆ ట్రాక్టర్ లో చెరుకు లోడ్ (tractor overloaded) అధికం కావడంతో ట్రాక్టర్ ముందు ఇంజిన్ భాగం యొక్క ముందు రెండు చక్రాలు నేలను తాకడం లేదు. ఇంజిన్ వెనుక భాగంలోని రెండు పెద్ద చక్రాలు మాత్రమే నేల పైన ఉన్నాయి. అయినప్పటికీ సదరు డ్రైవర్ ఆ ట్రాక్టర్ ను అలాగే తీసుకొని వెళ్తున్నాడు. ఈ వీడియో నెటిజన్ లను షాక్ కు గురి చేసింది.
ఇలా ఓవర్ లోడ్ తో వాహనం వెళ్లడం ఎంత ప్రమాదకరమో తెలుసుకోవాలని నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు. అదే సమయంలో అధికారులు కూడా ఇలాంటి వాటి పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. ఇలాంటి వైఖరి ఇతర వాహనదారులకు కూడా ఇబ్బందిని కలిగిస్తుందని చెప్పారు.
ఈ వాహనానికి నెంబర్ ప్లేట్ లేదని, టెయిల్ ల్యాంప్ లు కూడా లేవని తెలిపాడు. ఓవర్ లోడింగ్ వల్ల ఏదైనా ప్రమాదం జరిగిన సందర్భాలు కూడా చూశామని, కొన్నిసార్లు వంతనెల పైకి దొర్లడం, ఒక లైన్ మొత్తాన్ని బ్లాక్ చేయడం, ఓవర్ టేక్ చేసే సమయంలో ప్రమాదాలు జరగడం కనిపిస్తాయని ఒక ట్విట్టర్ వినియోగదారుడు ఈ ట్రాక్టర్ వీడియోను చూసి ఆందోళన వ్యక్తం చేశాడు. ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పాడు. ఇలా పలువురు నెటిజన్లు స్పందించారు.
Things you only see in India! What are your thoughts about such tractor overloading? pic.twitter.com/0Moyxx6e1J