»Vijayawada Former Mayor Tadi Shakuntala Joins Brs
Joining in BRS: కేసీఆర్ పార్టీలోకి విజయవాడ మాజీ మేయర్
విజయవాడ (Vijayawada) మాజీ మేయర్ తాడి శకుంతల (tadi shakuntala) గురువారం భారత రాష్ట్ర సమితి (bharat rashtra samithi) పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శకుంతల విజయవాడ మొగల్రాజపురానికి చెందిన వారు. 2005-06లో సీపీఐ తరఫున మొదటి ఏడాది నగర మేయర్ గా పని చేశారు.
విజయవాడ (Vijayawada) మాజీ మేయర్ (Foremer Mayor) తాడి శకుంతల (tadi shakuntala) గురువారం భారత రాష్ట్ర సమితి (bharat rashtra samithi) పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గుంటూరు (Guntur) జేకేసీ కళాశాల రోడ్డులోని పార్టీ కార్యాలయంలో ఆమెతో పాటు మహిళా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు మేకవరపు వరలక్ష్మి, ఓబీసీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ మాల్యాద్రి, పలువురు ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు (brs andhra pradesh president) తోట చంద్రశేఖర్ (Thota Chandrasekhar) సమక్షంలో వారు గులాబీ కండువాను కప్పుకున్నారు.
శకుంతల విజయవాడ మొగల్రాజపురానికి చెందిన వారు. 2005-06లో సీపీఐ తరఫున మొదటి ఏడాది నగర మేయర్ గా పని చేశారు. నాడు సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పొత్తులో భాగంగా మొదటి సంవత్సరం సీపీఐకి మేయర్ పదవి దక్కింది. ఆమె కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలలో కూడా పని చేశారు. బీఆర్ఎస్ పార్టీలో (BRS) చేరడానికి ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో (YSRCP) ఉన్నప్పటికీ చురుగ్గా లేరు. 2019లోనే వైసీపీలో చేరారు. కానీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు గులాబీ పార్టీలో చేరారు. విజయవాడ మేయర్ గా పని చేసిన మహిళల్లో టీడీపీ నుండి పంచుర్తి అనురాధ 2000 నుండి 2005 వరకు, తాడి శకుంతల 2005-06 వరకు, మల్లికా బేగం కాంగ్రెస్ నుండి 2006 నుండి 2008 వరకు, ఎంవీ రత్న బిందు కాంగ్రెస్ నుండి 2008 నుండి 2010 వరకు పని చేశారు. ప్రస్తుతం వైసీపీ నుండి రాయన భాగ్యలక్ష్మి మేయర్ గా ఉన్నారు.
APలో అన్ని స్థానాల్లో పోటీ
ఏపీలో బీఆర్ఎస్ 175 స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతోంది. ఎన్నికలకు మరో ఏడాది నాలుగు నెలల సమయం ఉంది. అప్పటి వరకు మరింత మంది నేతలను చేర్చుకోవడం ద్వారా అన్ని స్థానాల్లో పోటీ చేసి సత్తా చాటాలని భావిస్తోంది. తాము అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇటీవల తోట చంద్రశేఖర్ స్పష్టం చేశారు. తోట ఏపీ అధ్యక్షుడు అయినప్పటి నుండి చేరికల పైన దృష్టి సారించారు. ఆయా ప్రాంతాల్లో బీఆర్ఎస్ లో చేరడానికి ఆసక్తి కలిగిన వారిని చేర్చుకుంటున్నారు.
ఆయనే కాదు, తెలంగాణ మంత్రులు (Telangana Minisgters) కూడా గత జనవరి నెలలో ఇదే విషయాన్ని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) తాము 175 స్థానాల్లో పోటీ చేస్తామని, ఆంధ్ర ప్రదేశ్ లో ఎనిమిదేళ్ళయినా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదని గుర్తు చేస్తూ, తాము తెలంగాణలో (Telangana) కాళేశ్వరాన్ని (Kaleswaram Project) పూర్తి చేసినట్లుగా ఇక్కడ అధికారంలోకి వస్తే పోలవరం (Polavaram Project) పూర్తి చేస్తామన్నారు. తెలంగాణలో కేసీఆర్ (KCR) పాలన చూసి దేశం యావత్తు ఆయన ప్రధాని కావాలని కోరుకుంటోందన్నారు. కేసీఆర్ వంటి విజన్ ఉన్న నాయకుడు దేశానికి అవసరమని, త్వరలో జాతీయ రాజకీయాల్లో (Indian Politics) ఆయన కీలక పాత్ర పోషిస్తారన్నారు. తెలంగాణ వంటి సంక్షేమ పథకాలు ఎక్కడా లేవన్నారు. ఇప్పటి వరకు పోలవరం పూర్తికాలేదని, ప్రత్యేక హోదా (Special Status to Andhra Pradesh) కూడా రాలేదన్నారు. 2024నాటికి దేశంలో విజయం సాధించి, కేసీఆర్ ప్రధానిగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలన్నారు.