»Usa Another Flying Object Car Shot Down In The Usa Alaska Sky Is It China
USA: గగనతలంలో మరో వస్తువు కూల్చివేత..అది చైనాదేనా?
అమెరికా ఫైటర్ జెట్-22 అలాస్కా మీదుగా ఎత్తుగా ఎగురుతున్న గుర్తు తెలియని ఓ వస్తువును కూల్చివేసిందని వైట్ హౌస్ శుక్రవారం తెలిపింది. 40,000 అడుగుల ఎత్తులో తేలుతున్నందున అది పౌర విమానయానానికి ముప్పుగా పరిణమించినందున ఆ వస్తువును కూల్చివేశామని వెల్లడించారు.
అమెరికా (USA) గగనతలంలో చైనా గూఢచర్య బెలూన్ ఘటన జరిగిన కొన్ని రోజుల వ్యవధిలోనే మరో అనుమానాస్పద వస్తువు కనిపించడం కలకలం రేపుతోంది. తాజాగా ఆ వస్తువును కూడా అగ్రరాజ్యం కూల్చివేసింది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆదేశాల మేరకు అమెరికా మిలిటరీ ఫైటర్ జెట్-22 శుక్రవారం అలాస్కా(Alaska)లోని ఉత్తర తీరంలో ఎగురుతున్న గుర్తు తెలియని వస్తువును కూల్చిసినట్లు వైట్‌హౌస్ అధికారులు తెలిపారు. ఆ వస్తువు దాదాపు 40,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్నట్లు తెలిపారు. ఆ వస్తువు కారణంగా పౌర విమానాల భద్రతకు ముప్పు పొంచి ఉందనే అనుమానంతో కూల్చివేసినట్లు వైట్ హౌస్(white house) తెలిపింది.
అయితే, ఆ వస్తువు ఏమిటి? అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరికి చెందినది? ఎందుకు గగనతలంలోకి ప్రేవేశపెట్టారనే వివరాలు సహా అనేక అంశాలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఆ వస్తువు గురించి అనేక వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు జాన్ కిర్బీ(john kirby) తెలిపారు. ఇది ప్రభుత్వ యాజమాన్యం లేదా కార్పొరేట్ యాజమాన్యం లేదా ప్రైవేట్ యాజమాన్యం నుంచి ప్రయోగించారా అనే వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ వస్తువు కూడా చైనా నుంచి వచ్చినట్లు ఏదైనా అవకాశాలు ఉన్నాయా అని పలువురు మీడియా ప్రతినిధులు అడుగగా..ప్రస్తుతానికైతే ఇంకా తెలియదన్నారు. ఆ వస్తువు గురించి మరింత సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.
A U.S. military fighter jet shot down an object flying off the coast of Alaska on Friday on orders from President Joe Biden.
మరోవైపు విమానాలు ప్రయాణించే ప్రదేశానికి ఈ వస్తువు ఎత్తు చాలా దగ్గరగా ఉందని అలాస్కా జూనియర్ సెనేటర్‌గా పనిచేస్తున్న రిపబ్లికన్ డాన్ సుల్లివన్(dan sullivan) చెప్పారు. ఇది దాదాపు 40,000 అడుగుల ఎత్తులో ఉందన్నారు. గత వారం చైనా(china) నుంచి ప్రయోగించిన గూఢచారి బెలూన్ లాగా కాకుండా …ఇది చాలా ప్రమాదకరమైనదిగా కనిపించిందని పేర్కొన్నారు.
చాలా సంవత్సరాలుగా చైనా(china) నిర్వహిస్తున్న భారీ నిఘా కార్యక్రమంలో ఈ బెలూన్ ఒక భాగమని పెంటగాన్(pentagon) అంటోంది. ఇటీవలి సంవత్సరాలలో ఐదు ఖండాల్లోని అనేక దేశాలపై చైనా(china) బెలూన్ల ద్వారా నిఘా పెట్టిందని అమెరికా పేర్కొంది. ఈ క్రమంలో చైనా, అమెరికా(america) దేశాల మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారనున్నాయి. ఇంకోవైపు గతవారం అమెరికా(america) గగనతలంలో కూల్చేసిన చైనా బెలూన్ నుంచి కీలక సమాచారం సేకరించినట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు.