»Kanpur Iit Professor Malik Said India Massive Earthquake Chances
భారత్‌లో కూడా భారీ భూకంపాలు వచ్చే ఛాన్స్: IIT Professor Malik
భారత్‌లో భారీ భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందా ? అంటే అందుకు కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ జావేద్ మాలిక్ అవుననే అంటున్నారు. మరి ఎక్కడ వచ్చే అవకాశం ఉందో ఓసారి చుద్దాం.
టర్కీ, సిరియాలో వచ్చిన భూకంపం మాదిరిగా భారతదేశంలో కూడా భూ ప్రకంపనలు వచ్చే అవకాశం(earthquake chances) ఉందని ఐఐటీ కాన్పూర్(kanpur IIT)లోని ఎర్త్ సైన్స్ విభాగానికి చెందిన సీనియర్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ జావేద్ మాలిక్(Professor Malik) అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ జావేద్ మాలిక్ దేశంలో గత భూకంపాలకు కారణాలు, మార్పులపై చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్నారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో 7.5 తీవ్రతతో భూకంపాలు సంభవించవచ్చని ప్రొఫెసర్ మాలిక్ పేర్కొన్నారు.
ప్రధానంగా హిమాలయ ప్రాంతం
అయితే ఇది వచ్చే ఒకటి రెండు దశాబ్దాల్లో లేదా ఒకటి రెండేళ్లలో ఎప్పుడైనా సాధ్యమవుతుందని చెప్పారు. ఈ భూకంపాలు ప్రధానంగా హిమాలయ మాసిఫ్ లేదా అండమాన్, నికోబార్ దీవులలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నారు. అందుకే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. బలమైన భూకంపం దృష్ట్యా, ప్రతి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్ అన్నారు.
2004లోనే భారత్‌లో
భూమి లోపల టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానికొకటి ఢీకొనడం వల్ల భూకంపాలు సంభవిస్తాయని ప్రొఫెసర్ మాలిక్ వివరించారు. దీని వల్ల ఏర్పడే ఉద్రిక్తత శక్తి భూకంపానికి కారణమవుతుంది. శక్తి చాలా ఎక్కువగా ఉంటే, అప్పుడు భూకంపం సంభవించే ప్రకంపనలు అనుభూతి కూడా ఎక్కువగా ఉంటుందన్నారు. ఇక టర్కీలో భూకంపం తీవ్రత 7.8గా ఉండగా, 2004లోనే భారత్‌లో సంభవించిన భూకంపం తీవ్రత 9.1గా నమోదైందని మాలిక్ గుర్తు చేశారు. ప్రొఫెసర్ మాలిక్ భూకంప ప్రభావిత ప్రాంతాలైన కచ్, అండమాన్, ఉత్తరాఖండ్‌లో చాలా కాలంగా భూమి మార్పులను అధ్యయనం చేస్తున్నారు. భూ ప్రకంపనల దృష్ట్యా దేశంలో ఐదు జోన్ల(india earthquake zones)ను ఏర్పాటు చేశామన్నారు.
వెరీ డేంజర్ జోన్
జోన్-5లోని ప్రాంతాలు అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తించారు. దీనిని వెరీ హై డ్యామేజ్ రిస్క్ జోన్‌గా పేర్కొంటారు. కాశ్మీర్ ప్రాంతాలు, పశ్చిమ, మధ్య హిమాలయాలు, ఉత్తర, మధ్య బీహార్, ఈశాన్య భారత ప్రాంతం, రాన్ ఆఫ్ కచ్, అండమాన్, నికోబార్ ద్వీపాల సమూహం ఈ జోన్లో ఉన్నాయి.
ఢిల్లీ కూడా
ఇక జోన్ 4ను హై డ్యామేజ్ రిస్క్ జోన్ అని పిలుస్తారు. జమ్మూ, కాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, ఇండో-గంగా మైదానాల్లోని కొన్ని ప్రాంతాలు (ఉత్తర పంజాబ్, చండీగఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, బీహార్‌లోని ప్రధాన భాగం టెరాయ్ , ఉత్తర బెంగాల్, సుందర్బన్స్) దేశ రాజధాని ఢిల్లీ ఉన్నాయి. మహారాష్ట్రలో పటాన్ ప్రాంతం (కోయ్నానగర్) కూడా జోన్ 4లో ఉంది.
మెగాసిటీలు
అటు జోన్ 3 మోడరేట్ డ్యామేజ్ రిస్క్ జోన్‌గా వర్గీకరించబడింది. దీనిలో చెన్నై, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, భువనేశ్వర్ వంటి అనేక మెగాసిటీలు ఈ జోన్లో ఉన్నాయి.
తక్కువ అవకాశాలు
ఈ జోన్ 2లో తక్కువ నష్టం జరిగే ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ఇది భూకంపాలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్న జోన్. తిరుచ్చి, తిరుచిరాపల్లి వంటి నగరాలు ఈ జోన్లో కలవు. బులంద్‌షహర్, మొరాదాబాద్, గోరఖ్‌పూర్, చండీగఢ్ వంటివి కూడా ఇదే జోన్లో చేరాయి. మరోవైపు భారతదేశంలో భూకంప ప్రమాద మండలాలుగా జోన్ 1ని ఉపయోగించనందున.. ఏ ప్రాంతాన్ని కూడా జోన్ 1 కింద చేర్చలేదు. వర్గీకరించబడలేదు.