కేంద్ర బడ్జెట్ 2023-24 ప్రవేశపెట్టిన వేళ అందరి కళ్లు ఆర్థిక మంత్రి ధరించిన చీరపై ప్రత్యేక చర్చ జరుగుతోంది. ప్రతి ఏడాది బడ్జెట్ ప్రవేశ పెట్టే సందర్భంగా ఆర్థిక మంత్రిపైనే అందరి కళ్లు ఉంటాయి. ఆమె ఏ చీర ధరించారు?.. ఆ చీర ప్రత్యేకత ఏమిటనేది ప్రత్యేక చర్చ జరుగుతోంది. ఈసారి కూడా ‘అమృత్ కాల్ బడ్జెట్’ అనే పేరుతో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ధరించిన చీరపైనే చర్చ జరిగింది. ఆమె ధరించిన చీర ప్రత్యేకత తెలుసుకోండి.
ఎరుపు రంగు చీరలో మంత్రి నిర్మల దర్శనమిచ్చారు. బ్రౌన్ రంగు టెంపుల్ అంచుతో కూడిన చీర ధరించారు. నల్లని రంగు బోర్డర్, ఇంట్రికేట్ గోల్డెన్ వర్క్ జరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టెంపుల్ రంగు చీరలను సాధారణంగా నూలు, పట్టు లేదా ఈ రెండింటి మిశ్రమంతో తయారుచేస్తారు. వీటిని ప్రత్యేక సందర్భాల కోసం తయారు చేయించుకుని ధరిస్తారు. ఈ చీర విలువ దాదాపు రూ.25 వేల నుంచి 40 వేలు ఉంటుందని అంచనా.