Uddhav Thackeray: ఈసీ గులాంగిరి, బాల్ ఠాక్రే పేరు లేకుండా రండి..
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే (Maharashtra Chief Minister Eknath Shinde) వర్గాన్ని కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) అసలైన శివసేనగా (Shiv Sena) గుర్తించి, విల్లు, బాణం గుర్తులను ఆయన వర్గానికి కేటాయించింది
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే (Maharashtra Chief Minister Eknath Shinde) వర్గాన్ని కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) అసలైన శివసేనగా (Shiv Sena) గుర్తించి, విల్లు, బాణం గుర్తులను ఆయన వర్గానికి కేటాయించింది. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, క్యాడర్ అటువైపు ఉండడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నది. అయితే ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) మాత్రం తాను బాల్ థాకరే కొడుకును కాబట్టి ఆ పార్టీ, గుర్తు తమకు రావాలనే విధంగా మాట్లాడుతున్నారు. ఆదివారం ఎన్నికల సంఘం పైన మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు ఉద్ధవ్. అధికార పార్టీకి ఎన్నికల సంఘం గులాంగురి చేస్తోందని విమర్శించారు. గులాంగిరి చేసినప్పటికీ తన నుండి మాత్రం ఎప్పటికీ శివ సేనను తీసుకు వెళ్ళలేరు అన్నారు. ‘ మీరు పార్టీ పేరును, విల్లు, బాణం గుర్తును తీసుకు వెళ్ళవచ్చు.. కానీ నా నుండి శివ సేనను తీసుకు వెళ్ళలేరు ‘ అని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఉద్దేశించి అన్నారు.
అదే సమయంలో భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అంటారని పార్టీగా ఉన్న సమయంలో తన తండ్రి బాబా సాహెబ్ బాల్ థాక్రే ఆ పార్టీని అక్కున్ చేర్చుకున్నారు అని గుర్తు చేశారు. ఆ పార్టీకి ఇప్పుడు దమ్ముంటే మహారాష్ట్రలో తన తండ్రి పేరు చెప్పకుండా… కేవలం నరేంద్ర మోడీ పేరుతో ఓట్లు అడిగే దమ్ము ఉందా అని సవాల్ చేశారు.
శివసేన విషయంలో తాను ఈసీ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించే అవకాశం లేదు అన్నారు. ఈసీ గ్రౌండ్ లెవెల్ లోకి వచ్చి చూడాలి అన్నారు. ఈసీ తీసుకున్న నిర్ణయం తప్పు అన్నారు. శివసేన పార్టీని లేకుండా చేయాలని బిజెపి భావిస్తోంది మండిపడ్డారు. శివసేన లేకుండా చేయదా. ద్వారా మరాఠీల.. ఆ పై హిందువుల ఐక్యతను దెబ్బ తీయాలని చూస్తున్నదని అన్నారు. బీజేపీలో ఎక్కువ మంది అవినీతి నాయకులు ఉన్నారని ఆరోపించారు. ఇతర పార్టీ నుండి అవినీతి పరులను చేర్చుకొని కేసులను నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు.