»Traffic Diversions For Telangana Formation Celebrations In Hyderabad
Telangana ఆవిర్భావ సంబరాల వేళ.. హైదరాబాద్ లో ట్రాఫిక్ మళ్లింపులు ఇలా
హైదరాబాద్ లో పండుగ వాతావరణం సంతరించుకుంది. వీవీఐపీల తాకిడి అధికంగా ఉండడం.. సంబరాలు నిర్వహిస్తుండడంతో ట్రాఫిక్ పోలీసులు ప్రధాన రహదారుల్లో ఆంక్షలు విధించారు.
స్వరాష్ట్రంగా ఆవిర్భవించి తొమ్మిదేళ్లు పూర్తయి తెలంగాణ (Telangana) పదో పడిలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు (Telangana Decade Celebrations) 21 రోజులపాటు జరుగనున్నాయి. తొలి రోజు జూన్ 2వ తేదీన శుక్రవారం హైదరాబాద్ (Hyderabad) లో అట్టహాసంగా సంబరాలు నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తొలిసారి ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ లో పండుగ వాతావరణం (Festive Mood) సంతరించుకుంది. వీవీఐపీల తాకిడి అధికంగా ఉండడం.. సంబరాలు నిర్వహిస్తుండడంతో ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) ప్రధాన రహదారుల్లో ఆంక్షలు విధించారు. వాహనదారులు ప్రధాన మార్గాలకు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచనలు జారీ చేశారు.
కొత్త సచివాలయం (New Secretariat) ఆవరణలో సీఎం కేసీఆర్ (KCR) శుక్రవారం త్రివర్ణ పతాకం ఎగురవేయనున్నారు. అసెంబ్లీ (Assembly) ఎదురుగా తెలంగాణ అమరవీరుల స్తూపానికి (Telangana Martyrs Memorial) కూడా నివాళులర్పించనున్నారు. దీంతో ఆయా మార్గాల్లో వాహనాల మళ్లింపు చేశారు. వీవీ మార్గ్-నెక్లస్ రోటరీ, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి జంక్షన్ లపై ఉదయం పూట వాహనదారులకు అనుమతి లేదు. ఆ మార్గంలో వెళ్లాల్సిన వారు ఖైరతాబాద్, లక్డీకాపూల్ మీదుగా రాకపోకలు సాగించాలి. ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ మూసివేసి ఉంటుంది.
ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి ట్యాంక్ బండ్, రాణిగంజ్, లిబర్టీ వెళ్లాల్సిన వాహనదారులు తెలుగు తల్లి ఫ్లై ఓవర్ ఎక్కాలి. కింది వైపు నుంచి వాహనాలకు అనుమతి లేదు. హిమాయత్ నగర్ నుంచి ఖైరతాబాద్ వెళ్లే వాహనదారులు ఇక్బాల్ మినార్, లక్డీకాపూల్ వైపుగా వెళ్లాలి.
ఖైరతాబాద్ పెద్ద వినాయకుడి నుంచి ఐమ్యాక్స్, మింట్ కాంపౌంండ్ వైపు వాహనాలు నిషేధం. వారంతా రాజ్ దూత్ వైపు మళ్లాలి. ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు, లుంబినీ పార్క్ లు మూసి ఉంటాయి.
అమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్ వచ్చే సమయంలో రవీంద్ర భారతి, అసెంబ్లీ వైపు కూడా వాహనాల మళ్లింపు ఉంటుంది. వాహనదారులు వీటిని గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు సాగించాలని పోలీసులు సూచిస్తున్నారు. వాహనదారులు తమకు సహకరించాలని విన్నవించారు.