తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు లేవని కేసీఆర్ చేసిన కామెంట్లపై రేవంత్ రెడ్డి స్పందించారు. పచ్చి అబద్దాన్ని కూడా నిజం అనిపించేలా చెప్పడంలో మిమ్మల్ని మించిన వారు ఎవరూ లేరన్నారు.
Revanth reddy:తెలంగాణ సీఎం కేసీఆర్పై (cm kcr) టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అబ్దాలు చెబుతూ కాలం వెళ్ల దీస్తున్నారని.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు లేవని కేసీఆర్ (kcr) చేసిన కామెంట్లపై రేవంత్ (Revanth reddy) స్పందించారు. పచ్చి అబద్దాన్ని కూడా నిజం అనిపించేలా చెప్పడంలో మిమ్మల్ని మించిన వారు ఎవరూ లేరన్నారు.
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు సంబంధించి వివరాలు ఎన్సీఆర్బీ రికార్డుల్లో ఉన్నాయని రేవంత్ రెడ్డి (Revanth reddy) చెప్పారు. లెక్కకు రాని వివరాలు కూడా ఉన్నాయని చెప్పారు. రైతు స్వరాజ్య వేదికలో కూర్చొని మాట్లాడదామని పేర్కొన్నారు. ఆత్మహత్యలు లేవనే అంశంపై మీరు చేస్తోన్న మాటల్లో నిజం ఏంటో తెలుసుకుందాం అన్నారు. అందుకు మీరు సిద్దమా అని సీఎం కేసీఆర్కు (kcr) సవాల్ విసిరారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తోన్నాయి. ఈ ఏడాది డిసెంబర్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. అందుకే విపక్ష నేతలు పాదయాత్రతో జనం వద్దకు వెళ్లారు. ప్రజల సమస్యల గురించి ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూ.. ముందుకు సాగుతున్నారు. రైతుల ఆత్మహత్య గురించి సీఎం కేసీఆర్ (kcr) ప్రస్తావించగా.. కౌంటర్ ఇచ్చారు.
ఇటు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత భట్టి విక్రమార్క (bhatti vikramarka) కూడా పాదయాత్ర చేస్తున్నారు. అప్పుడప్పుడు జగ్గారెడ్డి (jagga reddy) హాట్ కామెంట్స్ చేస్తుంటారు. ఇటీవల సీఎం కేసీఆర్ను (kcr) కలువడంతో పార్టీ మార్పు అంశం చర్చకు వచ్చింది. కానీ అదేం లేదని తోసిపుచ్చారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు సహాజం అని.. అంతా సర్దుకుంటుందని సీనియర్ నేతలు చెబుతున్నారు.