తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పేపర్ లీకేజీ కేసులో కీలక నిందితులలో ఒకరైన రేణుకు షాక్ తగిలింది. TSPSC ప్రశ్న పత్రాలు లీక్ కేసు నిందితురాలు రేణుకకు నాంపల్లి కోర్టులో(Nampally Court) చుక్కెదురైంది. రేణుక బెయిల్ పిటిషన్(Bail Petition) ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఇక ఈ కేసులో మరో ముగ్గురు నిందితులను కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోరారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పేపర్ లీకేజీ కేసులో కీలక నిందితులలో ఒకరైన రేణుకు షాక్ తగిలింది. TSPSC ప్రశ్న పత్రాలు లీక్ కేసు నిందితురాలు రేణుకకు నాంపల్లి కోర్టులో(Nampally Court) చుక్కెదురైంది. రేణుక బెయిల్ పిటిషన్(Bail Petition) ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఇక ఈ కేసులో మరో ముగ్గురు నిందితులను కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోరారు. ఇటీవల అరెస్ట్ అయిన ప్రశాంత్, రాజేందర్, తిరుపతయ్యల కస్టడీ కోరారు సిట్ అధికారులు. ముగ్గురు నిందితులను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలన్నారు. కస్టడీ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. నిందితుల కస్టడీపై నాంపల్లి కోర్టు తీర్పు ప్రకటించనుంది. ఇక ఈ కేసులో ముగ్గురు నిందితులకు నాలుగో రోజు సిట్ విచారణ (SIT inquiry) ముగిసింది. సిట్ ఆఫీస్ నుంచి పాత సీసీఎస్ కు ముగ్గురు నిందితులను తరలించారు.
TSPSC ప్రశ్న పత్రాలు లీక్ కేసులో తెలంగాణ(Telangana) రాష్ట్రంలో సంచలన రేపింది. ఈ కేసులో రేణుక (Renuka)ఏ-3 నిందితురాలిగా ఉన్నారు. ఆమె బెయిల్ కోసం కోర్టుని ఆశ్రయించారు.తన ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని, ఇంటి దగ్గరున్న తన పిల్లలను చూసుకోవాలని తెలుపుతూ తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆమె బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు పేపర్ లీకేజీ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఇప్పటివరకూ నిందితులు, ఉద్యోగులే కేంద్రంగా దర్యాప్తు చేసిన సిట్ అధికారులు తాజాగా టీఎస్పీఎస్ సీ బోర్డు సభ్యులనా ఫోకస్ పెట్టారు. బోర్డు సభ్యలకూ సిట్ అధికారులు నోటీసులిచ్చారు. ఈ కేసుకు సంబంధించి బోర్డు చైర్మన్, సెక్రటరీలను కూడా విచారించారు. బోర్డ్ మెంబర్ లింగారెడ్డి పీఏ రమేశ్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
పేపర్ లీక్‌లో (Paper leak) అతడి పాత్రపై విచారిస్తున్నారు. అంతేకాకుండా.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి బోర్డు సభ్యుల స్టేట్మెంట్ కూడా తీసుకునే అవకాశం ఉంది. ఏడుగురు సభ్యుల స్టేట్మెంట్ను అధికారులు రికార్డు చేయనున్నారు. బోర్డులో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని సిట్ అధికారులు గుర్తించారు. కాన్ఫిడెన్షియల్ రూంలోకి ఎవరు పడితే వారు వెళ్లడం, ఏకంగా పెన్ డ్రైవ్‌లో ప్రశ్నాపత్రాలను కాపీ చేయడం.. ఈ ఘటనలతో అక్కడ నిఘా నామమాత్రంగా ఉందనే అంచనాకు వచ్చారు.అటు..బోర్డు సభ్యుడు లింగారెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. అటు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ (Anita Ramachandran) విచారించారు. సిట్ ఆఫీసులో అనితా రామచంద్రన్ ను విచారించిన అధికారులు.. సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగించారు.