IPL 2023 : తిప్పేసిన మార్క్‌వుడ్.. లఖ్‌నవూ చేతిలో దిల్లీ చిత్తు
ఐపీఎల్( IPL 2023) లో మూడో మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌పై(Delhi Capitals)..లఖ్‌నవూ సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) 50 పరుగుల తేడాతో ఘనం విజయం సాధించింది. ఐపీఎల్లో 16వ సీజన్లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. లక్నోలోని భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పాయి ఏక్నా స్టేడియంలో(Vajpayee Ekna Stadium) జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఐపీఎల్( IPL 2023) లో మూడో మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌పై(Delhi Capitals)..లఖ్‌నవూ సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) 50 పరుగుల తేడాతో ఘనం విజయం సాధించింది. ఐపీఎల్లో 16వ సీజన్లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. లక్నోలోని భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పాయి ఏక్నా స్టేడియంలో(Vajpayee Ekna Stadium) జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోరు సాధించింది. . లఖ్‌నవూ నిర్దేశించిన 194 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో.. దిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులే చేయగలిగింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్(Captain David Warner) (56; 48 బంతుల్లో 7 ఫోర్లు) పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. రిలీ రోసోవ్ (30) ఫర్వాలేదనిపించాడు. పృథ్వి షా (12), మిచెల్ మార్ష్ (0), సర్ఫరాజ్ ఖాన్ (4), పావెల్ (1), హకీమ్ ఖాన్ (4), అక్షర్ పటేల్ (16), చేతన్ సకారియా (4), కుల్దీప్ యాదవ్ (6*), ముకేశ్ కుమార్ (0*) పరుగులతో పేలవ ప్రదర్శన చేశారు. ఇక, దిల్లీ బౌలర్లలో.. మార్క్ వుడ్ (Mark Wood)14 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. లక్నో బౌలర్ మార్క్ వుడ్ బంతితో నిప్పులు చెరగడంతో ఢిల్లీ బ్యాటర్లు క్రీజులో కుదురుకోలేకపోయారు. వరుసపెట్టి వికెట్లు తీస్తూ ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలు చేశాడు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. కైల్ మేయర్స్(Kyle Meyers) ఊచకోతతో భారీ స్కోరు సాధించింది. 38 బంతులు మాత్రమే ఎదుర్కొన్న మేయర్స్ 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 73 పరుగులు సాధించాడు. చివర్లో నికోలస్ పూరన్ (Nicholas Pooran), ఆయుష్ బదోనీ చెలరేగడంతో జట్టు స్కోరు అమాంతం పెరిగింది. పూరన్ 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 36 పరుగులు చేయగా, ఆయుష్ బదోని 7 బంతుల్లో ఫోర్, 2 సిక్సర్లతో 18 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ చివరి బంతిని కృష్ణప్ప గౌతమ్ సిక్సర్‌గా మలచడంతో స్కోరు 190 పరుగులు దాటింది. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, చేతన్ సకారియా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఐదు వికెట్లు పడగొట్టి ఢిల్లీ పతనాన్ని శాసించిన లక్నో బౌలర్ మార్క్ వుడ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఐపీఎల్లో నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య హైదరాబాద్‌లో, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-ముంబై ఇండియన్స్ మధ్య బెంగళూరులో మ్యాచ్‌లు జరుగుతాయి.