Telangana : రాష్ట్రంలో నాలుగు రోజులపాటు వర్ష సూచన..
అటు ఎండలు, ఇటు వానలతో తెలంగాణలో (Telangana) వాతావరణం మరోసారి మారనుంది. ఓవైపు ఎంత తీవ్రత రోజు రోజుకు పెరుగుతుండగా మధ్య మధ్యలో వర్షాలు పలుకరిస్తున్నాయి. తాజాగా ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులు వర్షం (Rain) కురవనుంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ (Hyderabad) వాతావరణ కేంద్రం తెలిపింది.
అటు ఎండలు, ఇటు వానలతో తెలంగాణలో (Telangana) వాతావరణం మరోసారి మారనుంది. ఓవైపు ఎంత తీవ్రత రోజు రోజుకు పెరుగుతుండగా మధ్య మధ్యలో వర్షాలు పలుకరిస్తున్నాయి. తాజాగా ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులు వర్షం (Rain) కురవనుంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ (Hyderabad) వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 48 గంటలు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని పేర్కొన్నది.అకాల వర్షాలు, వడగళ్ల వానలకు పంటలు దెబ్బతినడంతో ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన రైతులను (Farmers) వరి పంట చేతికందే సమయంలో వడగళ్ల వాన భయం వెంటాడుతోంది. ఆకాశం మబ్బు పడితే చాలు రైతుల గుండె వేగం పెరుగుతోంది. ఎప్పుడు ఎటువైపు నుండి ఈదురుగాలితో కూడిన అకాల వర్షంతోపాటు వడగళ్ల వాన పడుతుందోనన్న భయంతో రైతులు కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వరిపైర్లు గింజ గట్టిపడే దశలో ఉన్నాయి. ఈ ఏడాది వానాకాలంలో విస్తారంగా వర్షాలు కురవడంతో యాసంగి నాట్లు వేసే సమయానికి అంటే డిసెంబరు(December), జనవరి నెలలో విస్తారంగా భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయి. వాటితోపాటు కాలువలు, చెరువుల కింద సాగునీటి వనరులు ఈ సారికూడా విస్తారంగా అందుబాటులో ఉంటాయన్న ధీమాతో రైతులు పెద్ద ఎత్తున వరి సాగు చేశారు.
తెలంగాణ (Telangana) ప్రాంత చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంతగా యాసంగిలో ఈ సారి రికార్డు స్థాయిలో దాదాపు 56లక్షల ఎకరాల్లో వరి సాగయింది. అయితే పంట ఈనే దశలో మార్చి నెలలలో భూగర్భ జలాలు (Ground water) అడుగంటిపోయాయి.అదే సమయంలో వాగులు, చెరువులు, రిజర్వాయర్ల కింద సాగునీరు (irrigation water) అందుబాటులో లేకపోవడంతో వరి పొలాలు గణనీయమైన విస్తీర్ణంలో ఎండిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో గడిచిన నెల రోజులుగా రైతులు(Farmers) వరుస తడులమీద వరిపొలాలు ఎండిపోకుండా నానా అవస్థులు పడుతూ పంటను కాపాడుకుంటున్నారు. నాలుగు రోజులకు ఒక మడి చొప్పున తడి అందిస్తూ పంట మండి ఎండకుండా రాత్రింబవళ్లు ఊరిన నీరు ఊరినట్లే తడులు అందిస్తున్నారు. రైతుల శ్రమ ఫలించి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వరి పైర్లు గింజ గట్టిపడే దశలో ఉన్నాయి. ఇంకొక్క 10 రోజులు ఆగితే వరి పంట చేతికందే సమయం. అయితే ఈ తరుణంలో రైతులను అకాల వర్షాలు(rains),వడళ్ల వానల భయం వెంటాడుతోంది.