News : శివరాత్రి వేడుకల్లో విషాదం.. నదిలో ముగ్గురు యువకులు గల్లంతు..!
News : మహా శివరాత్రి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని శైవక్షేత్రాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు బారులు తీరారు. శివనామస్మరణతో ఆలయాలు మారుమ్రోగాయి. ఈ ఆనందోత్సవాల నడుమ ఆంధ్రప్రదేశ్ లో విషాదం నెలకొంది.
మహా శివరాత్రి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని శైవక్షేత్రాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు బారులు తీరారు. శివనామస్మరణతో ఆలయాలు మారుమ్రోగాయి. ఈ ఆనందోత్సవాల నడుమ ఆంధ్రప్రదేశ్ లో విషాదం నెలకొంది.
పోలవరం మండలం పట్టిసీమ వద్ద ఉన్న శివాలయాన్ని దర్శించుకునేందుకు ముగ్గురు యువకులు వెళ్లారు. అక్కడ స్నానాలు చేసేందుకు గోదావరి నదిలో దిగారు. ప్రవాహం ఎక్కువగా ఉండడంతో నది ప్రవాహానికి ముగ్గురు కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.
గల్లంతైన వారు తూర్పు గోదావరి జిల్లా దోసకాయలపల్లికి చెందిన వారని గుర్తించారు. ఈ ఘటన ఏలూరు జిల్లాలోని పోలవరం మండలం పట్టిసీమలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ గాలింపుల్లో ముగ్గురు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు ఓలేటి అరవింద్( 20), ఎస్.కె. లుక్మన్ (19), పెదిరెడ్డి రాంప్రసాద్ (18)లుగా పోలీసులు గుర్తించారు.