జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదులు మరోసారి కాల్పులతో విరుచుకుపడ్డారు. ఆ క్రమంలో చెందిన సంజయ్ శర్మ అనే మైనారిటీ పౌరుడు మృతి చెందాడు. అతను స్థానిక మార్కెట్‌కు వెళ్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
జమ్ముకశ్మీర్(jammu Kashmir)లోని పుల్వామా(Pulwama)లో ఉగ్రవాదులు(Terrorist) మరోసారి ఆదివారం కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో కాశ్మీరీ పండిట్ వర్గానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తి మరణించాడు. సంజయ్ శర్మ(sanjay sharma)స్థానిక మార్కెట్‌కు వెళ్తుండగా ఉగ్రవాదులు అతడిపై కాల్పులు జరిపారు. వెంటనే గమినించిన స్థానికులు అతడిని ఆసుపత్రి(hospital)కి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందాడు. శర్మ జమ్ముకశ్మీర్‌లోని ఓ బ్యాంకులో సెక్యూరిటీ గార్డు(security guard)గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ మేరకు కశ్మీర్ పోలీసులు(Kashmir police) ఓ ట్వీట్ చేస్తూ వివరాలు ప్రకటించారు.
Terrorists fired upon one civilian from minority namely Sanjay Sharma from Pulwama while on way to local market. He was shifted to hospital however, he succumbed to injuries. There was Armed guard in his village. Area cordoned off. Details shall follow: Kashmir Police pic.twitter.com/cX5m9LaXdf
మరోవైపు జమ్ముకశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ శర్మ హత్యను తీవ్రంగా ఖండించింది. ఈ ఘటన హృదయ విదారకమైన పిరికి చర్యగా పేర్కొంది. హేయమైన నేరంకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ఇంకోవైపు రక్తపాతం, అమాయకమైన ప్రజలను చంపడం చాలా ఖండించదగిన చర్య అని JKPCC వెల్లడించింది. ఈ క్రమంలో మృతుని కుటుంబ సభ్యుల(family)కు సంఘీభావం ప్రకటించింది.
కశ్మీర్లో పండిట్ల రక్షణ కోసం పలు చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం చెబుతున్నా కూడా వారి ప్రాణాలకు రక్షణ ఉండటం లేదు. గతంలో కూడా ఉగ్రవాదుల కాల్పులకు అనేక మంది పండిట్లు( Pandit community) ప్రాణాలు కోల్పోయారు. బుడ్గాం జిల్లాలో 2022 మే నెలలో ఉగ్రవాదుల కాల్పుల్లో రాహుల్ భట్ అనే కశ్మీర్ పండిట్ మృత్యువాత చెందాడు. తహసిల్ కార్యాలయంలోనే ఉదయం సమయంలో టెర్రరిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడటం సంచలనంగా మారింది. ఈ ఘటన మరువక ముందే మళ్లీ తాజాగా పుల్వామా జిల్లాలో కాల్పులకు పాల్పడ్డారు. ఈ టెర్రరిస్టులు ప్రధానంగా కశ్మీరి పండిట్లు, వలస కార్మికులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా మైనారిటీ వర్గాలకు చెందిన వారిపైనే ఎక్కువగా కాల్పులు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇలా పలుమార్లు ఉగ్రవాదుల కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడి మైనారిటీ ప్రజలు తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని భయంభయంతో జీవిస్తూ కాలం వెళ్లదిస్తున్నారు.