Ganta srinivas rao:ఆంధ్రప్రదేశ్లో మార్పు మొదలైందని మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాస రావు (Ganta srinivas rao) అన్నారు. గత ఎన్నికల్లో తప్పు చేశామనే భావనలో ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు. పాలిచ్చే ఆవుని కాకుండా.. తన్నే దున్నను తెచ్చుకున్నామనే భావనలో ఉన్నారని తెలిపారు. జగన్ (jagan) ప్రభుత్వానికి రోజులే మిగిలి ఉన్నాయని తెలిపారు. కౌంట్ డౌన్ ప్రారంభమైందని చెప్పారు.
చంద్రబాబు (chandrababu) బర్త్ డే వేడుకలను విశాఖపట్టణం టీడీపీ ఆఫీసులో నిర్వహించారు. నేతలు, కార్యకర్తలతో కలిసి గంటా శ్రీనివాస రావు కేక్ చేశారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తాను కూడా ఒకరిని దత్తత తీసుకుంటానని గంటా ప్రకటించారు. గత నాలుగేళ్లలో ఒక ఇటుక వేయలేదని.. ఇప్పుడు పోర్ట్, ఎయిర్ పోర్టు అని హడావిడి చేస్తే ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. సెప్టెంబర్ నుంచి విశాఖలో (vizag) పాలన చేస్తామని చెబితే నమ్మే పరిస్థితి లేదని చెప్పారు.
రాష్ట్రానికి చంద్రబాబు (chandrababu) సీఎం కావడం చారిత్రక అవసరం అని చెప్పారు. చంద్రబాబు ఎక్కిడికి వెళ్లినా జనం బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత నిజమో.. వచ్చే ఎన్నికల్లో బాబు సీఎం కావడం అంతే నిజం అన్నారు. అవినీతి, అక్రమాల్లో వైసీపీ సర్కార్ దేశంలో ఫస్ట్ ప్లేస్లో నిలిచిందని గంటా శ్రీనివాస రావు (Ganta srinivas rao) విమర్శించారు.
సంపద కంటే విజ్ఞానమే గొప్పదని, ఆ విజ్ఞానమే మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది ప్రపంచమే నీ ముందు తలవంచుతుంది అని నమ్మిన ఎకైక నాయకుడు,రేపటి భవిత కోసం ప్రజలే తన కుటుంబం అనుకుని కష్టపడే నిత్యవిద్యార్థి మా అన్న @ncbn గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు💐, మీరు నిండు నూరేళ్ళ… pic.twitter.com/g2LW0kUsrP
వచ్చే ఏడాది ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటినుంచే వైసీపీ, టీడీపీ మధ్య డైలాగ్ వార్ తీవ్రస్థాయికి చేరింది. నిన్న శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ (cm jagan) పర్యటించారు. పోర్టుల గురించి, విశాఖ నుంచి పరిపాలన అంటూ కామెంట్ చేశారు. దీనిపై ఈ రోజు టీడీపీ నేతలు, గంటా శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు.