»Telangana It Raids On Christian Missionaries In Hyderabad
IT Raids మరోసారి తెలంగాణలో ఐటీ దాడులు.. క్రైస్తవ సంస్థలే లక్ష్యం
గతంలో ఐటీ, ఫార్మా, రియల్ ఎస్టేట్ సంస్థలపై దాడులు చేశారు. తెలంగాణ మంత్రులు, ప్రజాప్రతినిధులే లక్ష్యంగా గతంలో దాడులు జరిగాయి. కొన్ని నెలల వ్యవధిలో తెలుగు రాష్ట్రాల్లో 50 కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ శాఖ దాడులు జరిగాయి.
తెలంగాణ (Telangana)లో మళ్లీ ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ (Income Tax Department) అధికారులు దాడులు జరిపారు. హైదరాబాద్ (Hyderabad)లో బుధవారం తెల్లవారుజామునే ఐటీ సోదాలు (Searching) మొదలవడం కలకలం రేపింది. ఈసారి క్రైస్తవ సంస్థలే (Christian Missionaries) లక్ష్యంగా ఐటీ దాడులు జరిగాయి. క్రైస్తవ మిషనరీలతో పాటు పలు సంస్థలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తెలంగాణలోని దాదాపు 40 ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అల్వాల్ (Alwal), బొల్లారం (Bollaram), కీసర (Keesara), జీడిమెట్ల, మెదక్, పటాన్ చెరు తదితర ప్రాంతాల్లో ఐటీ అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు. మొత్తం 9 సంస్థల్లో సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.
2016లో ఏర్పాటైన బాల వికాస్ ఫౌండేషన్ (Bala Vikasa Foundation) ఏర్పాటైంది. ఈ సంస్థ డైరెక్టర్లుగా సురేశ్ రెడ్డి, ప్రకాశ్ రెడ్డి ఏలెటి, సురేశ్ రెడ్డి సింగిరెడ్డి ఉన్నారు. మెదక్, వరంగల్ లో కూడా తనిఖీలు చేస్తున్నారు. జనవరి 31వ తేదీన ఐటీ దాడులు జరగ్గా మరోసారి తనిఖీలు కొనసాగాయి. రానున్న ఎన్నికల నేపథ్యంలో (Assembly Elections) అధికార పార్టీకి సహకరిస్తున్న కంపెనీలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరుగుతున్నాయని సమాచారం. దాడులకు గురైన సంస్థలు బీఆర్ఎస్ పార్టీ (BRS Party)కి కొంత అనుకూలంగా ఉన్నట్టు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దాడులు జరిగాయని చర్చ నడుస్తోంది.
గతంలో ఐటీ, ఫార్మా, రియల్ ఎస్టేట్ సంస్థలపై దాడులు చేశారు. తెలంగాణ మంత్రులు, ప్రజాప్రతినిధులే లక్ష్యంగా గతంలో దాడులు జరిగాయి. కొన్ని నెలల వ్యవధిలో తెలుగు రాష్ట్రాల్లో 50 కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ శాఖ దాడులు జరిగాయి. రియల్ ఎస్టేట్, సినిమా నిర్మాతల నివాసాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే. తాజా దాడుల నేపథ్యంలో రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఈ విషయమై ఇటీవల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KT Rama Rao) కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పిన కొన్ని రోజులకే ఐటీ దాడులు చోటుచేసుకోవడం కలకలం రేపుతున్నది.