»Telangana Group 1 Exam Prelims Hall Ticket Released 2023
Telangana Group 1: ఎగ్జామ్ హాల్ టిక్కెట్లు రిలీజ్
రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. జూన్ 11న జరగనున్న ప్రిలిమ్స్ ఎగ్జామ్(Telangana Group 1 Exam prelims) హాల్ టిక్కెట్లను అధికారులు విడుదల చేశారు.
తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ హాల్ టిక్కెట్లు ఈరోజు విడుదలయ్యాయి. అభ్యర్థులు ఇక్కడ క్లిక్ చేసి www.tspsc.gov.inలో మీ హాల్ టిక్కెట్లను డౌల్ చేసుకోవచ్చు. ఇవి డౌన్ లోడ్ చేసుకోవాలంటే TSPSC IDతోపాటు పుట్టిన తేదీని నమోదు చేయాల్సి ఉంటుంది. TSPSC గ్రూప్ 1 ఎగ్జామ్ కోసం అప్లై చేసిన అభ్యర్థులు మొత్తం ఈ ప్రిలిమ్స్ పరీక్ష రాసేందుకు అర్హులు. షెడ్యూల్ చేయబడిన తేదీ ప్రకారం జూన్ 11, 2023న ఈ పరీక్ష జరగనుంది. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎగ్జామ్ ఉంటుందని అధికారులు తెలిపారు. మరోవైపు గతంలో అక్టోబర్ 16న రాసిన అభ్యర్థుల హాల్ టిక్కెట్ ఇప్పుడు చెల్లదని, మళ్లీ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తెలంగాణలోని 33 జిల్లాల్లో 503 పోస్టుల కోసం గ్రూప్ 1 పరీక్షను నిర్వహిస్తుంది. గతంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ సహా పలు ప్రశ్నపత్రాలు లీకైయ్యాయి. దీంతో గతంలో నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేశారు. ఉద్యోగానికి ఉత్తమమైన వ్యక్తిని కనుగొనడానికి బోర్డు మూడు-దశల ఎంపిక ప్రక్రియను ఏర్పాటు చేసింది. మొదటి దశలో బోర్డు ప్రిలిమినరీ వ్రాత పరీక్షకు అభ్యర్థులను ఆహ్వానిస్తుంది. ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మెయిన్ రాత పరీక్షలో పాల్గొనడానికి అర్హులు, ఆపై వారి పత్రాలు తనిఖీ చేసి చివరిగా ఫైనల్ చేస్తారు.