తారకరత్న అకాల మరణం నందమూరి కుటుంబంలో, చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నిన్న హైదరాబాద్ లోని తారకరత్న నివాసానికి వెళ్లి నివాళి అర్పించారు. ఆయన పార్థివదేహాన్ని చూసి బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ సహా పలువురు భావోద్వేగానికి గురయ్యారు. తారకరత్న అంత్యక్రియలు నేడు సాయంత్రం (సోమవారం, 20 ఫిబ్రవరి) మహాప్రస్థానంలో జరగనున్నాయి
తారకరత్న (Tarakaratna) అకాల మరణం నందమూరి కుటుంబంలో, చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నిన్న హైదరాబాద్ లోని (hyderabad) తారకరత్న నివాసానికి వెళ్లి నివాళి అర్పించారు. ఆయన పార్థివదేహాన్ని చూసి బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ సహా పలువురు భావోద్వేగానికి గురయ్యారు. తారకరత్న అంత్యక్రియలు నేడు సాయంత్రం (సోమవారం, 20 ఫిబ్రవరి) మహాప్రస్థానంలో జరగనున్నాయి. ఉదయం 9 గంటలకు రంగారెడ్డి జిల్లా మోకిలా నుండి ఫిల్మ్చాంబర్కి భౌతికకాయాన్ని తరలిస్తారు. పది గంటల సమయానికి ఫిల్మ్చాంబర్కు ఆయన భౌతికకాయం చేరుకుంటుంది. అభిమానుల, ప్రజల సందర్శనార్థం ఫిల్మ్ చాంబర్లో మధ్యాహ్నం మూడు గంటల వరకు భౌతికకాయం ఉంటుంది. ఆ తర్వాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
తారకరత్న గుండెపోటు కారణంగా హాస్పిటల్ లో చేరి, 23 రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మరణం పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తూ… సంతాపం ప్రకటించారు. బాలకృష్ణ, చిరంజీవి, కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ తదితరులు నివాళుర్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ, తెలుగు రాష్టాల ముఖ్యమంత్రులు జగన్ జ్ కేసిఆర్, విదేశాల్లో ఉన్న నటుడు మోహన్ బాబు తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మరోవైపు తన భర్త తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో శోక సంద్రంలో మునిగిపోయిన భార్య అలేఖ్యా రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. భర్త మరణం తర్వాత శనివారం సాయంత్రం నుండి ఆమె ఏమి భుజించలేదు. దీంతో ఆమె పూర్తిగా నీరసించి అస్వస్థతకు గురయ్యారు. మృతి చెందిన విషయం తెలిసినప్పటి నుండి ఆమె కన్నీరు మున్నీరు అవుతున్నారు. తారకరత్న కూతురు నిష్క తండ్రి మృతదేహాన్ని చూసి భోరున విలపించింది. అలేఖ్య రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు తారకరత్న. తన పిల్లలకు తాత ఎన్టీఆర్ పేరు వచ్చేలా పేర్లు పెట్టారు. మొదట పుట్టిన పాపకు నిష్క అని, ఆ తర్వాత ఇద్దరికీ తాన్యారామ్, రేయ అని పేరు పెట్టారు. ఈ ముగ్గురు పేర్లలోని మొదటి అక్షరాలు వరుస.. NTR అని వస్తుంది.