»Star Heroine Bipasha Basu Cried With Neha Dhupia Video Call Two Holes In Daughters Heart
Bipasha basu: కుమార్తె గుండెకు 2 రంధ్రాలు..ఏడ్చిన స్టార్ హీరోయిన్
సెలబ్రిటీల జీవితాలు చాలా సంతోషంగా ఉంటాయని అనేక మంది అనుకుంటారు. కానీ కష్టాలు, అనారోగ్యం సహా అనేక విషయాల్లో అందరూ ఒక్కటేనని పలు సందర్భాలలో అనిపిస్తుంది. అవును. ఇటివల బాలీవుడ్ నటి బిపాసా బసు నటి నేహా ధూపియాతో జరిగిన వీడియో సంభాషణలో సంచలన విషయాలను వెల్లడించారు. తన కుమార్తె పుట్టినప్పుడు గుండెలో రెండు రంధ్రాలు ఉన్నట్లు తెలిపి కన్నీరు పెట్టుకున్నారు.
బాలీవుడ్ నటి జంట బిపాసా బసు(bipasha basu), కరణ్ సింగ్ గ్రోవర్ గత ఏడాది నవంబర్‌లో తమ మొదటి బిడ్డ కుమార్తె దేవికి జన్మనిచ్చారు. ఆ క్రమంలో
తరచుగా వారి చిన్నారుల ఫోటోలు, వీడియోలను కుటుంబ సభ్యులతో సహా అభిమానులను పంచుకున్నారు. అయితే ఇటివల నటి నేహా ధూపియాతో జరిగిన సంభాషణలో బిపాసా తన ప్రసవం తర్వాత తాను ఎదుర్కొన్న కీలక సవాళ్ల గురించి వెల్లడించింది. తన బిడ్డకు గుండెకు రెండు రంధ్రాలు ఉన్నాయని, మూడు నెలల వయస్సులో వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ (VSD) శస్త్రచికిత్స చేయించుకున్న హృదయవిదారక సంఘటనను తెలిపింది.
నటి బిపాసా బసు తన మాతృత్వ జర్నీ గురించి నేహా ధూపియాతో ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆగస్టు 5న మాట్లాడింది. తల్లిగా అనుభవించాల్సిన కష్టమైన రోజుల గురించి అడిగినప్పుడు, బిపాసా ప్రసవించిన వెంటనే తాను అనుభవించిన బాధాకరమైన అనుభవం గురించి తెలిపింది. తమ కుమార్తె గుండెలో రెండు రంధ్రాలతో పుట్టిందని.. ప్రసవించిన మూడు రోజుల తర్వాత తనకు, తన భర్త కరణ్‌కు తెలిసిందని ఆమె వెల్లడించింది. దేవి మూడు నెలల వయస్సులో ఉన్నప్పుడు వెంట్రిక్యులర్ సెప్టల్(VSD) లోపం కారణంగా శస్త్రచికిత్స చేయవలసి వచ్చిందన్నారు. ఆ క్రమంలో ఏ తల్లికి ఇలా జరగాలని తాను కోరుకోనని భావోద్వేగానికి లోనై చెప్పింది. ఆ నేపథ్యంలో కన్నీరు పెట్టుకుంది.
అయితే ప్రస్తుతం తన కుమార్తె(daughter) బాగానే ఉందన్నారు. ఇతర తల్లులకు సమాచారం అందించడానికి తన కథనాన్ని పంచుకోవాలని అనుకున్నట్లు వెల్లడించారు. ఆపరేషన్ సమయంలో పది మంది వైద్యులు మీకు ఏమి జరుగుతుందో తనకు వివరించడం చాలా కష్టమైందని గుర్తు చేసుకున్నారు. మొత్తానికి తన కుమర్తె దేవికి ఆపరేషన్ విజయవంతంగా జరిగిందన్నారు. కానీ తన పాప OTలో ఉన్న ఆరు గంటలు నా జీవితం ఆగిపోయినట్లు అనిపించిందని బిపాస వెల్లడించారు. అయితే 2015లో విడుదలైన ‘అలోన్’ సినిమా సెట్స్‌లో బిపాసా బసుకు కరణ్ సింగ్ గ్రోవర్ పరిచయమయ్యారు. ఆ క్రమంలో వీరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారగా.. ఈ జంట ఏప్రిల్ 30, 2016న వివాహం చేసుకున్నారు.