»South Central Railway Appeals Public Not To Involve In Stone Pelting On Trains
stone pelting on trains: రైలుపై రాళ్లు విసిరితే 5 ఏళ్ల జైలు శిక్ష… రైల్వే హెచ్చరిక
రైళ్ల పైన రాళ్ల దాడి (stone pelting on trains) వంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని దక్షిణ మధ్య రైల్వే (South Central Railway-SCR) మంగళవారం హెచ్చరించింది.
రైళ్ల పైన రాళ్ల దాడి (stone pelting on trains) వంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని దక్షిణ మధ్య రైల్వే (South Central Railway-SCR) మంగళవారం హెచ్చరించింది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express) సహా వివిధ రైళ్ల పైన రాళ్ల దాడి (stone pelting on trains) జరుగుతున్న విషయాన్ని గుర్తు చేసింది. ఇలాంటి ఆకతాయి పనులకు దూరంగా ఉండాలని చెప్పింది. ఇటీవలి కాలంలో కాజీపేట – ఖమ్మం, కాజీపేట – భువనగిరి, ఏలూరు – రాజమండ్రి తదితర ప్రాంతాల్లో ఆకతాయిలు రెచ్చిపోయినట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఇటీవలి కాలంలో, వందే భారత్ రైళ్లను దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు… జనవరి నుండి అలాంటి తొమ్మిది సంఘటనలు నమోదయ్యాయని తెలిపింది. రైళ్లపై రాళ్లు రువ్వడం చట్టరీత్యా నేరమని, రైల్వే చట్టంలోని సెక్షన్ 153 ప్రకారం నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇది 5 సంవత్సరాల వరకు జైలు శిక్షతో కూడిన శిక్షార్హమని హెచ్చరించింది.
వివిధ కేసులకు సంబంధించి ఇప్పటి వరకు 39 మంది నేరస్తులను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (Railway Protection Force-RPF) అరెస్ట్ చేసింది. కొన్ని రాళ్ల దాడి ఘటనలలో ఆరేళ్ల నుండి పదిహేడేళ్ల పిల్లలు కూడా ఉండటం గమనార్హం. అందువల్ల పిల్లలు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాల నుండి దూరంగా ఉండేలా వారికి సలహాలు, మార్గనిర్దేశం చేయడం సమాజంలోని ప్రతి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దల బాధ్యత అని దక్షిణ మధ్య రైల్వే (SCR) పేర్కొంది. ఇటువంటి సంఘటనలు ప్రజా ఆస్తుల విలువైన నష్టానికి దారి తీయడంతో పాటు రైళ్ల రీ-షెడ్యూల్‌కు దారి తీస్తున్నాయని, రాళ్లతో కొట్టడం వల్ల ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారని ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రజా ఆస్తులకు నష్టం కలిగించే, ప్రయాణీకులకు తీవ్ర గాయాలు కలిగించే చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ (SCR General Manager Arun Kumar Jain) ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (Railway Protection Force-RPF) అవగాహన ప్రచారాలు, ట్రాక్‌ల సమీపంలోని గ్రామాల సర్పంచ్‌లతో సమన్వయం చేయడంతో పాటు అనేక నివారణ చర్యలను చేపడుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సీహెచ్ రాకేష్ (SCR Chief Public Relations Officer Ch Rakesh) తెలిపారు. అంతేకాకుండా, రాళ్లు రువ్వే బ్లాక్ స్పాట్లను అన్నింటిలోనూ సిబ్బందిని మోహరించారు.