SA vs IND: నిప్పులు చెరిగిన టీమిండియా పేసర్లు..116 పరుగులకే దక్షిణాఫ్రికా ఆలౌట్
భారత బౌలర్లు చెలరేగారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో 116 పరుగులకే భారత్ ఆలౌట్ చేసింది. భారత పేసర్ అర్షదీప్ సింగ్ 5 వికెట్లు పడగొట్టగా, అవేష్ ఖాన్ 4 వికెట్లు తీశాడు.
నేడు దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా పేసర్లు విజృంభించారు. ఆటలో అద్భుతంగా రాణించారు. అర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్ నిప్పులు చెరుగుతూ దక్షిణాఫ్రికా బ్యాటర్లను పెవిలియన్‌కు పంపించారు. జొహాన్నెస్ బర్గ్ లో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా జట్టు 27.3 ఓవర్లలో 116 పరుగులకు కుప్పకూలింది.
Innings Break!
Sensational bowling performance from #TeamIndia! 👌 👌
దక్షిణాఫ్రికా బ్యాటర్లను భారత ఎడమచేతివాటం పేసర్ అర్షదీప్ సింగ్ హడలెత్తించాడు. 5 వికెట్లను పడగొట్టాడు. మరో ఎండ్ లో అవేష్ ఖాన్ 27 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ల తీశాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ఫెహ్లుక్వాయో 3 ఫోర్లు, 2 సిక్సులతో 33 పరుగులు మాత్రమే అత్యధిక స్కోరు చేయగలిగాడు. ఓపెనర్ టోనీ డి జోర్జి 28, కెప్టెన్ ఐడెన్ మార్ క్రమ్ 12, తబ్రైజ్ షంసీ 11 పరుగులు చేయగా మిగిలినవారంతో సింగిల్ డిజిట్‌కే వెనుతిరిగారు. దీంతో 116 పరుగులకే దక్షిణాఫ్రికా జట్టును భారత్ ఆలౌట్ చేసింది.
Maiden 5⃣-wicket haul in international cricket! 👏 👏