»Satyaraj Tamil Movie Weapon Is The First Indian Movie With Ai Technology
AI: దేశంలో ఏఐ టెక్నాలజీతో మూవీ..మరోవైపు ఆందోళన!
ప్రపంచాన్ని అబ్బురుపరుస్తున్న ఏఐ టెక్నాలజీ వాడకం క్రమంగా అనేక రంగాల్లో పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇండియాలోని సినిమా ఇండస్ట్రీలో కూడా దీనిని మొదటిసారిగా వినియోగించారు. అంతేకాదు ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ వివరాలు ఇప్పుడు చుద్దాం.
Satyaraj, Tamil movie Weapon is the first Indian movie with AI technology
AI: ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపేస్తున్న సాంకేతికత ఏఐ(Artificial Intelligence). ఈ టెక్నాలజీ(Technology) గురించి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిని ఉపయోగించి అద్భుతాలు(Wonders) చేస్తున్నారు. కంప్యూటర్ ప్రోగ్రామ్ నుంచి వివిధ కంపెనీలకు కావల్సిన ఎన్నో ఉత్పత్తులను దీన్ని ఉపయోగించే తయారు చేస్తున్నారు. అయితే ఈ ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్(AI) టెక్నాలజీ మూలనా భవిష్యత్తులో చాలా మంది ఉపాధి కోల్పోతామని భయపడుతున్నారు. ఇటీవలే హాలీవుడ్ స్క్రీన్‌ప్లే, కథా రచయితలు కూడా ఈ టెక్నాలజీ వాడకంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో కూడా దీని సేవలు విసృతంగా వినియోగించుకుంటున్నారు. ఏకంగా తమిళ సినీ పరిశ్రమ(Kollywood Industry) ఒక అడుగు ముందుకేసి ఏఐ సాంకేతికతో సినిమా చిత్రీకరణ చేపట్టింది. సత్యరాజ్(Sathyaraj) ప్రధాన పాత్రలో నటిస్తున్న తమిళ చిత్రం వెపన్(Weapon)లో ఈ టెక్నాలజీతో ఓ సీక్వెన్స్‌కు రూపకల్పన చేశామని దర్శకుడు గుహన్ సెన్నియప్పన్(Guhan Senniappan) చెప్పారు.
దర్శకుడు మాట్లాడుతూ.. ఈ చిత్రంలో సత్యరాజ్‌కు సూపర్ పవర్స్ ఉంటాయి. ఆయన యుక్త వయసు నేపథ్యంలో కొన్ని సన్నివేశాలను రూపోందించాల్సి వచ్చింది. దాని కోసం మాములుగా వాడే గ్రాఫిక్స్ బదులు ఏఐ టెక్నాలజీని ఉపయోగించామన్నారు. ఇప్పటికే హాలీవుడ్లో మిషన్ ఇంపాజిబుల్, డెడ్ రెకానింగ్-1 వంటి భారీ మూవీల్లో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. ఇక భారతదేశంలో ఏఐని ఉపయోగిస్తున్న తొలిచిత్రం తమదే అని పేర్కొన్నారు. కాకపోతే ఇంగ్లీష్ సినిమాలకు సెట్ అయినట్లు భారతీయ చిత్రాలకు ఈ పరిజ్ఙానం అంతగా సూట్ కాదు. భారతీయ పాత్రల సృష్టిలో కొన్ని లోపాలున్నాయని వెల్లడించారు.