»Samsung Galaxy Ring Technology Will Come To The Market 2024
Samsung Ring: రింగ్ టెక్నాలజీ వచ్చేస్తుంది..త్వరలోనే మార్కెట్లోకి
ప్రస్తుతం ఉపయోగిస్తున్న స్మార్ట్‌వాచ్ టెక్నాలజీ ఇక మారనుంది. అవును ప్రస్తుతం ఆరోగ్య ఫీచర్లతో కూడిన స్మార్ట్ రింగ్(samsung galaxy Ring)లు త్వరలోనే రానున్నట్లు తెలుస్తోంది. దీంతో వీటిని ధరించి హెల్త్ ట్రాకింగ్ సహా అనేక విషయాలు తెలుకోవచ్చని అంటున్నారు. అందుకోసం ప్రముఖ సంస్థ శాంసంగ్ స్మార్ట్ రింగ్ లను అందుబాటులోకి తెచ్చేందుకు కృషిచేస్తున్నట్లు తెలిసింది.
Samsung ‘Galaxy Ring’ పేరుతో 2024లో తన స్మార్ట్ రింగ్‌ని విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ దేశీయ, అంతర్జాతీయ కాంపోనెంట్ తయారీదారులతో ఈ మేరకు సహకరిస్తున్నట్లు సమాచారం. ఇది వచ్చే నెల ప్రారంభంలో నిర్ణయించబడుతుందని నివేదికలు చెబుతున్నాయి. స్మార్ట్ రింగ్‌లో అంతర్నిర్మిత సెన్సార్లు ఉంటాయి. ఇవి శరీరం నుంచి ఆరోగ్య డేటాను సేకరిస్తాయి. ఆ క్రమంలో కనెక్ట్ చేయబడిన స్మార్ట్‌ఫోన్‌కు యాక్సెస్ చేస్తాయి. దీని ద్వారా ఖచ్చితమైన సమాచారంతో రింగ్‌ను ధరించిన వినియోగదారుడు పలు విషయాలను తెలుసుకోవచ్చు. అయితే వేలి పరిమాణానికి సరిపోయేలా ఈ టెక్నాలజీని సర్దుబాటు చేస్తున్నట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో పేటెంట్ అప్లికేషన్ల ప్రకారం కెమెరాలు, సెన్సార్లను ఉపయోగించి వినియోగదారుల తల, చేతి కదలికలను ట్రాక్ చేయడానికి XR సాంకేతికతను ఉపయోగించి XR (మిక్స్డ్ రియాలిటీ) పరికరాలతో ‘Galaxy Ring’ని ఏకీకృతం చేయడాన్ని Samsung పరిశీలిస్తోంది. ఈ క్రమంలో దీనిని అభివృద్ధి సమయంలో శామ్సంగ్ సవాళ్లను ఎదుర్కొంటుందని, బలహీనమైన రక్త ప్రసరణ లేదా డేటా ఖచ్చితత్వాన్ని ప్రభావితం చేసే అంశాలు అమర్చడం సవాలుగా మారినట్లు సమాచారం. అయితే దీని ఉత్పత్తి, వైద్య పరికర స్థితి ధృవీకరణను పొందేందుకు 10 నుంచి 12 నెలల సమయం పట్టవచ్చని.. దీని వలన ఉత్పత్తి లభ్యత ఆలస్యం కావచ్చని అంటున్నారు.
మొత్తంమీద ‘Galaxy Ring’ ఆరోగ్య సాంకేతికతలో సరికొత్త ముందడుగు అని టెక్ నిపుణులు అంటున్నారు. వినూత్న స్మార్ట్ రింగ్ పరికరం ద్వారా వినియోగదారులకు వారి ఆరోగ్యం, ఫిట్నెస్ సహా పలు విలువైన సమాచారన్ని అందించనుంది. అయినప్పటికీ, ఉత్పత్తిని విజయవంతంగా మార్కెట్లోకి తీసుకురావడానికి కంపెనీ సాంకేతిక అడ్డంకులను అధిగమించి, ధృవీకరణ ప్రక్రియను నావిగేట్ చేయాల్సి ఉంటుంది.