Deepfake Scamతో భద్రం..కాల్స్ లిఫ్ట్ చేశారో ఇక అంతే సంగతులు
డీప్ ఫేక్ స్కామ్ పేరుతో సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. వాట్సాప్ ద్వారా ఆడియో, వీడియో కాల్స్ చేసి.. న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసి.. తర్వాత డబ్బులు గుంజుతున్నారు.
AI Deepfake Scam: టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) (AI) వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. దీనిని కొందరు కేటుగాళ్లు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. అందులో భాగమే డీప్ ఫేక్ స్కామ్ (Deepfake Scam).. అంటే వాట్సాప్‌లో ఫేక్ ఆడియో, వీడియో కాల్స్ చేస్తున్నారు. కష్టాల్లో ఉన్నాం అని సాయం చేయాలని కోరుతున్నారు. మరికొందరు న్యూడ్ వీడియోలు తీస్తూ.. తర్వాత బ్లాక్ మెయిల్ (black mail) చేస్తున్నారు. ఓ మహిళా (woman) తన భర్త వాయిస్‌ను సింథటిస్ చేసింది. ఇలా డీప్ ఫేక్ స్కామ్ (Deepfake Scam) గురించి విస్తుగొలిపే విషయాలు తెలుస్తున్నాయి.
డార్క్ వెబ్ (dark web), ఇంటర్నెట్ నుంచి వినియోగదారుల ఫోటోలు (photo), వీడియోలు, సమాచారాన్ని సైబర్ కేటుగాళ్లు సేకరిస్తున్నారు. ఏఐ ఆధారంగా డీప్ ఫేక్ టెక్నాలజీ పనిచేస్తోంది. ఎదుటివారు నమ్మేలా ఫోటోలు, వీడియోలు వినియోగించి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేస్తారు. ఒకవేళ కాల్ లిప్ట్ చేశారో ఇక అంతే సంగతులు. వారితో మాట్లాడుతుంది నిజమైన వ్యక్తులతో అనిపిస్తోంది. ఆ కాల్స్‌ను డీప్ ఫేక్ కాల్స్ అంటారు.
ఇబ్బందుల్లో ఉన్నామని నమ్మించి ఆర్థిక సాయం చేయాలని అడుగుతున్నారు. మరికొందరు న్యూడ్ కాల్స్ చేస్తున్నారు. కాల్స్ చేసిన వ్యక్తి తెలిసిన వారు అయి ఉంటారని నమ్ముతున్నారు. ఆ సమయంలో వీడియో కాల్స్ చేస్తే రికార్డ్ చేస్తున్నారు. తర్వాత డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా కొందరు వ్యక్తుల మొహలను ఉపయోగించి.. ఫేక్ పోర్న్ వీడియోలు కూడా తెలుస్తున్నారు. వీటి వల్ల కొందరు ఆత్మహత్య కూడా చేస్తున్నారు.
ఇటీవల ఓ మహిళ తన భర్త వాయిస్‌ను డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా రికార్డ్ చేసింది. ఆ కాల్‌తో భర్త తనను వేధిస్తున్నట్టు నమ్మించే ప్రయత్నం చేసింది. తర్వాత అసలు విషయం తెలిసింది. కేరళకు చెందిన ఒకరు డీప్ ఫేక్ కాల్ బారిన పడి రూ.40 వేలు పోగొట్టుకున్నాడు. సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నందున.. అప్రమత్తంగా ఉండటమే ముఖ్యం.. సోషల్ మీడియాలో ఫోటో, వీడియో షేర్ చేసే వారితో జాగ్రత్తగా ఉండటం మేలు. లేదంటే సైబర్ కేటుగాళ్ల బారిన పడి చేతి చమురు వదిలించుకోవాల్సి వస్తోంది.