»Salman Khan And Karan Johar And Vishnu Vardhan Combo Is A Huge Action Movie
Salman khan: సల్మాన్, కరణ్ జోహార్, విష్ణు కాంబోలో భారీ యాక్షన్ మూవీ
చాలా కాలంగా ఎదురుచూస్తున్న క్రేజీ కాంబో మళ్లీ 25 ఏళ్ల తర్వాత రిపీట్ అవుతుంది. సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్ల కలయికలో భారీ బడ్జెట్ మూవీ రాబోతుంది. ఈ చిత్రానికి సక్సెస్ ఫుల్ మూవీ షెర్షా డైరెక్టర్ విష్ణు వర్ధన్ తెరకెక్కించనున్నారు. దీంతో సినీ ఫ్యాన్స్ ఈ మూవీ అప్ డేట్ కోసం ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు.
25 ఏళ్ల తర్వాత బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్(Salman khan), కరణ్ జోహార్(Karan Johar) ధర్మ ప్రొడక్షన్ తో కలిసి భారీ బడ్జెట్ చిత్రాన్ని చేయబోతున్నారు. ఈ డైనమిక్ ద్వయం కలిసి పనిచేయడానికి ఇప్పటికే రెడీ అయ్యారు. అయితే ఈ మూవీకి ప్రముఖ దర్శకుడు విష్ణు వర్ధన్(Vishnu vardhan) డైరెక్షన్ చేయనున్నారు. ఈ యాక్షన్ మూవీ కోసం సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్, విష్ణు వర్ధన్ గత 6 నెలలుగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. చివరకు ఫైనల్ అయ్యిందని సమాచారం. ఇది టైగర్ 3 మూవీ తర్వాత దీనిని తెరకెక్కించనున్నారు. అంతేకాదు ఈ చిత్రం నవంబర్ 2023లో సెట్స్‌పైకి కూడా వెళ్లనుందని సమాచారం. షేర్షా తర్వాత హిందీ చిత్ర పరిశ్రమలో విష్ణు వర్ధన్‌కి ఇది రెండవ చిత్రం కావడం విశేషం.
ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ 2024 సందర్భంగా రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టుకు ఇంకా పేరు పెట్టలేదు. సల్మాన్ ఖాన్ ఈ మూవీ కోసం రాబోయే కొన్ని నెలలు వెచ్చించనున్నాడు. దీంతోపాటు బాడీ లాంగ్వేజ్ ను కూడా మార్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక సల్మాన్ ఖాన్ ఇప్పటికే మనీష్ శర్మ దర్శకత్వం వహించిన టైగర్ 3(tiger 3) మూవీ ఈ దీపావళికి విడుదలకు సిద్ధంగా ఉంది. అంతేకాకుండా YRF-నిర్మించిన టైగర్ vs పఠాన్ సూరజ్ బర్జాత్యా దర్శకత్వం వహించిన ప్రేమ్ కీ షాదీ కూడా ఉన్నాయి.