వార్ 2 చిత్రం(war2 movie) గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. ఈ మూవీలో ఇప్పటికే హృతిక్, జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేస్తుండగా..హీరోయిన్ ఎవరనే టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో అలియా భట్(alia bhatt) ఈ చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది.
వార్ 2 చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan)తో ఎన్టీఆర్ యాక్ట్ చేయనున్నట్లు ఇప్పటికే తెలిసింది. అయితే ప్రస్తుతం ఈ క్రేజీ ప్రాజెక్టులో హీరోయిన్ ఎవరనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ క్రమంలో ఈ సినిమాలో అలియా భట్(alia bhatt) తన RRR సహనటుడు జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి స్పై థ్రిల్లర్‌లో హృతిక్ రోషన్‌తో చేరబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ చిత్రం కోసం దీపికా పదుకొనే(Deepika Padukone), సర్వరీ వాఘ్లను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అయితే చివరికి ఎవరిని ఫైనల్ చేస్తారనేది మాత్రం ఇంకా తెలియలేదు.
అయితే అలియా(alia bhatt) యంగ్ హీరోయిన్ అయిన నేపథ్యంలో ఆమెవైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇటీవల ఆమె నటించిన చిత్రాలు 100 కోట్ల క్లబ్ లో చేరడం కూడా ఆమెకు మంచి అవకాశమని పలువురు అంటున్నారు. అయితే మరి అలియా ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకుందా లేదా మేకర్స్ ఎవరిని హీరోయిన్ గా ఎంపిక చేస్తారనేది మరికొన్ని రోజుల్లో తెలియనుంది. అసలు ఈ సినిమాలో ఎవరు హీరోయిన్ అయితే బాగుంటుందో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరోవైపు మే 20న ఎన్టీఆర్(NTR) బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఎన్టీఆర్ గురించి అప్ డేట్ వస్తుందని సినీ ప్రియులు వేచి చూస్తున్నారు. అయాన్ ముఖర్జీ వార్ 2 చిత్రానికి దర్శకత్వం వహిస్తారని ఇప్పటికే ప్రకటించారు. కానీ ‘బ్రహ్మాస్త్ర’ డైరెక్టర్ అయాన్ ఎన్టీఆర్ కోసం పవర్ ఫుల్ రోల్ డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది. హృతిక్ రోషన్‌తో ఎన్టీఆర్ లాంటి హీరో డీ కొడితే.. స్క్రీన్స్ చిరిగిపోతాయనడంలో ఎలాంటి డౌట్స్ లేవు.
ఇప్పటివరకు నెగెటివ్ పాత్ర చేసిన ఏ నటుడు కూడా రూ.100 కోట్ల మొత్తంలో పారితోషకం తీసుకోలేదట. అందుకే తారక్ వార్2తో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. హృతిక్ రోషన్ కూడా 100 కోట్లు తీసుకుంటున్నాడట. ఇది కూడా రికార్డేనని అంటున్నారు. హీరోతో పాటు ఈక్వల్‌గా విలన్ రెమ్యూనరేషన్ ఉండడం ఇప్పటి వరకు జరగలేదట. మరి అనౌన్స్మెంట్కు ముందే ఇన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తే.. వార్ 2 రిలీజ్ అయిన తర్వాత ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.