»Crazy Video Update From Project K Movie Assembling The Raiders
Project K: నుంచి క్రేజీ వీడియో అప్ డేట్
ప్రాజెక్ట్ K(Project K) అనేది ఇప్పటివరకు భారతీయ తెరపై నిర్మించిన అత్యంత ఖర్చుతో కూడిన చిత్రం. ఈ మూవీలో ప్రభాస్(prabhas) యాక్ట్ చేస్తున్న నేపథ్యంలో ఈ చిత్రంపై భారీగా అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ ఈ చిత్రంలోని 'రైడర్స్' కోసం కాస్ట్యూమ్స్ మేకింగ్ చూపించే వీడియోను విడుదల చేశారు. ఈ రైడర్లు ప్రాజెక్ట్ Kలో విలన్ లేదా సైన్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ వీడియోను మీరు కూడా ఓసారి చూసేయండి మరి.
ప్రభాస్ రాబోయే భారీ బడ్జెట్ చిత్రం ప్రాజెక్ట్ K(Project K) ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. నిర్మాతలు ప్రీ-ప్రొడక్షన్ పనుల గురించి వీడియోలను బహిర్గతం చేయడం ద్వారా ఈ చిత్రం గురించి సరికొత్త బజ్ ఏర్పడింది. మొదటి ఎపిసోడ్ రీ-ఇన్వెంటింగ్ ది వీల్, ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన వీల్ తయారీని చూపించగా.. రెండో ఎపిసోడ్ లో అసెంబ్లింగ్ ది రైడర్స్(Assembling The Raiders) పేరుతో విడుదల చేశారు. అసలు రైడర్స్ ఎవరు? అనే చర్చ వీడియోలో మొదలైంది. రైడర్లను ఘోరంగా కనిపించేలా చేసే దుస్తులను తయారు చేయడం మొదటి నుంచి ఎలా ప్రారంభించారో వారు వీడియోలో చూపించారు. తర్వాత వారు విలన్ యూనిఫాం సైన్ అని తేల్చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇది సినిమాలో అత్యంత ఖరీదైన భాగమని నిర్మాత చెబుతున్నారు.
ప్రభాస్(prabhas)ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్గా పేరు తెచ్చుకున్నప్పటికీ ఈ చిత్రం దేనికి సంబంధించినదో ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ K చిత్రంపై అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాను అత్యంత రహస్యంగా నిర్మిస్తుండటం విశేషం.
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అశ్విని దత్ నిర్మాణంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ పై చీత్రికరిస్తున్నారు. ఇప్పటికే ప్రకటించినట్లుగా ప్రాజెక్ట్ K(Project K) జనవరి 12, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ప్రభాస్ యాక్ట్ చేస్తున్న కీలక చిత్రాల్లో ఒకటైన సాలార్ కూడా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ నేపథ్యంలో సాలార్ మూవీ ఎప్పుడు రిలీజ్ చేస్తారని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.