»Rishabh Pant Might Take Up To 2 Years To Return For India Sourav Ganguly
Sourav Ganguly : పంత్ కి మరో రెండేళ్లు పడుతుంది..
Sourav Ganguly : రిషభ్ పంత్ ఎప్పుడెప్పుడు మైదానంలోకి అడుగుపెడుతాడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ షాకిచ్చాడు. పంత్ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టడానికి కనీసం రెండేళ్లు అయినా పడుతుందని ఆయన చెప్పడం గమనార్హం.
రిషభ్ పంత్ ఎప్పుడెప్పుడు మైదానంలోకి అడుగుపెడుతాడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ షాకిచ్చాడు. పంత్ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టడానికి కనీసం రెండేళ్లు అయినా పడుతుందని ఆయన చెప్పడం గమనార్హం.
గతేడాది డిసెంబర్ లో పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. 2022 డిసెంబర్ 30న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్, ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు.. కారు ప్రమాదంలో రిషబ్ పంత్ మోకాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే అతను మరో ఆరు లేదా ఏడు నెలల్లో క్రికెట్లోకి వస్తాడని ప్రచారం జరుగుతోంది. దీంతో… ఆ వార్త విని అందరూ హ్యాపీగా ఫీలయ్యారు. పంత్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే…. పంత్ రావడానికి రెండేళ్లు పడుతుందని గంగూలీ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు.
ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రిషబ్ పంత్ రీఎంట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు సౌరవ్ గంగూలీ..
‘రిషబ్ పంత్‌తో నేను రెండు మూడు సార్లు మాట్లాడాను. అతను ఇప్పుడు చాలా కష్ట సమయంలో ఉన్నాడు. గాయాలతో, సర్జరీలతో నొప్పిని భరిస్తున్నాడు. అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా..అతను టీమిండియా తరుపున ఆడడానికి ఏడాదికి పైగా సమయం పడుతుంది. మరో రెండేళ్లు పట్టినా పట్టొచ్చు…’ అని పేర్కొన్నారు. ఈ వార్త పంత్ అభిమానుల్లో మరింత గుబులు పెంచడం గమనార్హం.