రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రముఖ ఇండియన్ క్రికెటర్ రిషబ్ పంత్ కోలుకుంటున్నాడు. మోకాలి లిగమెంట్ కు రిషబ్ పంత్ శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం పంత్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. ఈ వారంలోనే పంత్ ను డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. డిసెంబర్ 30వ తేదిన ఇండియన్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొంది. మొదట డెహ్రాడూన్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయనకు వైద్య చికిత్స అందించారు.
అయితే మెరుగైన చికిత్స కోసం ఆయన్ని ముంబైలోని ధీరూబాయి కోకిలాబెన్ ఆస్పత్రికి తరలించారు. కోకిలాబెన్ ఆస్పత్రి వైద్యులు పంత్ మోకాలికి చేసిన సర్జరీ విజయవంతమైందని, అతను కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. ఇకపోతే పంత్ మోకాలి లిగమెంట్లకు వైద్యులు మార్చిలో మరో సర్జరీ చేయనున్నారు. దీంతో ఎంత లేదన్నా పంత్ తిరిగి మైదానంలోకి వచ్చేందుకు మరో 8 నుంచి 9 నెలలు సమయం పట్టే అవకాశం ఉంది.