Prabhas: వరస సినిమాలతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) బిజీగా ఉన్నాడు. ఆదిపురుష్ మిక్స్డ్ టాక్ తెచ్చుకోగా.. ఆ తర్వాత సలార్, కల్కీ, మారుతీ మూవీ, స్పిరిట్ సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నాడు. ప్రభాస్ (Prabhas) అనారోగ్యం గురించి ఓ వార్త ఫిల్మ్ నగర్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ మోకాలి నొప్పులతో బాధపడుతున్నాడట. ప్రస్తుతం సలార్ మూవీ రిలీజ్కు సిద్ధంగా ఉంది. సో.. ఆ మూవీ రిలీజ్ తర్వాత సర్జరీ చేయించుకోనున్నారని తెలుస్తోంది.
వచ్చేనెల 28వ తేదీన సలార్ మూవీ రిలీజ్ కానుంది. ఆ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు ముగిసిన తర్వాత ప్రభాస్ (Prabhas) సర్జరీ జరగనుంది. ఆదిపురుష్ మూవీ సమయంలో.. ప్రీ రిలీజ్ వేడుక మీద కూడా ప్రభాస్ చాలా ఇబ్బంది పడ్డారు. అంతకుముందు ఇచ్చిన కమిట్ మెంట్ ప్రకారం సలార్ మూవీ షెడ్యూల్ పూర్తి చేశారు. ఆ తర్వాత సినిమాలకు మాత్రం బ్రేక్ ఇస్తారట. సర్జరీ తర్వాత కొద్దీరోజులు విశ్రాంతి తీసుకుంటారని తెలుస్తోంది.
సర్జరీ తర్వాత కోలుకున్నాకే ప్రభాస్ (Prabhas) నెక్ట్స్ మూవీ షూటింగ్ ఉంటుంది. పెళ్లి గురించి కూడా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ప్రతీసారి ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటారు. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో కూడా తిరుపతిలోనే చేసుకుంటానని వివరించారు.