పాకిస్తాన్(Pakisthan)లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan)ను అరెస్ట్(Arrest) చేసిన సంగతి తెలిసిందే. ఇమ్రాన్ అరెస్ట్‌తో ఆ దేశం అట్టుడుకుతోంది. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి నిరసన(Protest) తెలుపుతున్నారు. ఆందోళనలు ఎక్కువవ్వడంతో పాక్ సైన్యం(Pak Army) వారిని నిలువరించలేకపోతోంది. తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్‌ను కోర్టు ఇప్పటికే దోషిగా తేచ్చింది. అదేవిధంగా అల్ఖదీర్ ట్రస్ట్ కేసులో కూడా దోషిగా తేల్చింది. దీంతో ఇమ్రాన్ కోసం మద్దతుదారులు ఆందోళనలు చేస్తున్నారు.
పాక్‌లో చెలరేగిన అల్లర్ల వల్ల ఇప్పటి వరకూ 130 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. పంజాబ్ ప్రావిన్స్‌లో సర్కారు భారీ సైన్యాన్ని మోహరించింది. ఇమ్రాన్ ఖాన్(Imran Khan)ను కస్టడీలోకి తీసుకున్నప్పటి నుంచి పోలీసులు ఆయన్ని తీవ్రంగా వేధిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. రాత్రంతా ఇమ్రాన్ ను టార్చర్ చేసినట్లు వార్త వైరల్ అవ్వడంతో ఆయన మద్దతుదారులు రెచ్చిపోయారు.
ఇమ్రాన్ ఖాన్(Imran Khan) మద్దతుదారులు పాక్ లోని పెద్ద పెద్ద బిల్డింగులను ధ్వంసం చేయడమే కాకుండా పోలీసు వాహనాలకు నిప్పు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో పాక్ పోలీసులు వెయ్యి మందిని అరెస్ట్ చేశారు. చట్టానికి వ్యతిరేకంగా నడుచుకున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ఊరుకోమని ఇమ్రాన్ మద్దతుదారులకు పాక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.