Revanth Reddy: అందుకే.. మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి
తెలంగాణ (telangana) ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ( congress party) ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి (revanth reddy) ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ (telangana) ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ( congress party) ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి (revanth reddy) ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆయన హాత్ సే హాత్ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివారం వేములవాడలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తెచ్చినట్లుగా చెప్పుకునే పార్టీకి రెండుసార్లు అధికారం ఇచ్చారని, తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలన్నారు. ఉమ్మడి పాలనలో కొనసాగే వివక్ష కెసిఆర్ పాలనలో కూడా కొనసాగుతోంది అన్నారు.
బీఆర్ఎస్ మంత్రులు సన్నాసులు అని మండిపడ్డారు. మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్లు చెబితే తలెత్తుకోలేని పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఫ్యామిలీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని కూడా వదలడం లేదన్నారు. వేల కోట్లు ఉన్న కెసిఆర్ కుటుంబం… నిరుపేదల సొమ్ము కూడా తినడం దారుణం అన్నారు. గుడిని, గుడిలో లింగాన్ని మింగే పాలనలో మనం ఉన్నామని చెప్పారు. వంద కోట్ల రూపాయలతో వేములవాడ ను అభివృద్ధి చేస్తానని చెప్పు, దేవుడిని కూడా మోసం చేశారన్నారు. వేములవాడ ఎమ్మెల్యేను ఈ నియోజకవర్గం ప్రజలు కలవాలంటే జర్మనీ వెళ్ళే పరిస్థితి కనిపిస్తోంది అని ఎద్దేవా చేశారు. నియోజకవర్గం ప్రజలు అంటే ఆయనకు గౌరవం లేదని, అందుకే ఇక్కడి పౌరసత్వం వదులుకొని, ప్రజలతో సంబంధం తెంపుకున్నారని విమర్శించారు.