»Record Breaking First Single From Rajinikanth Jailer Kaavaale Song
JAILER:తో రికార్డుల మోత మోగిస్తున్న రజినీ కాంత్!
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన అత్యంత అంచనాల చిత్రం జైలర్ నుంచి మొదటి సింగిల్ కావలా గురువారం విడుదలైంది. ఇది రిలీజైన కొన్ని గంటల్లోనే ట్రైండింగ్లో కొనసాగడంతోపాటు అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
సూపర్ స్టార్ రజినీ కాంత్ కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు రజినీకాంత్ సినిమా అనగానే రికార్డుల మోత మోగుతుంది. తాజాగా అది మరోసారి ప్రూవ్ అయ్యింది. రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా జైలర్. ఇప్పటికే రజినీకాంత్ లుక్ మూవీకి బాగా హైప్ తీసుకువచ్చాయి. కాగా తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్(Kaavaalaa Lyric Video) విడుదల చేశారు. అనిరుధ్ కంపోజ్ చేసిన ఈ పాట ఇప్పుడు రికార్డులు బద్దలు కొడుతోంది. కావాలా అనే పాట, వినోదభరితమైన సంభాషణలో రజనీకాంత్, తమన్నా వేసిన స్టెప్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
డాక్టర్, విక్రమ్ తర్వాత దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్తో మూడోసారి జతకట్టిన అనిరుధ్ రవిచందర్ ఈ పాటను కంపోజ్ చేశారు. అరుణ్రాజా కామరాజ్ సాహిత్యం అందించారు. శిల్పారావ్తో పాటు తన గాత్రాన్ని కూడా అందించారు. తెలుగులో ‘ఓకే’ అని అర్థం వచ్చే కావాలా, తమిళం, తెలుగు పదాలను కలగలిపిన ద్విభాషా పాట కావడం విశేషం. ఈ పాటకు అభిమానులు, సంగీత ప్రియుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. కొన్ని గంటల్లోనే 13 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం.