Tamannaah: తెలుగులో తమన్నా చివరిగా కనిపించిన చిత్రం భోళా శంకర్. ఆ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా తమన్నా తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై సంతకం చేసింది. రాబోయే క్రైమ్ థ్రిల్లర్ ఓదెలా 2లో అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఓదెలా చిత్రం 2022లో నేరుగా OTTలో విడుదలై మంచి విజయం సాదించింది. మొదటి భాగంలో హెబ్బా పటేల్ నటించారు. కొన్ని బోల్డ్ సీన్లతో ఆకర్షణీయమైన కంటెంట్ ఉండడం వలన సినిమా మంచి హిట్ అయింది. తమన్నా కెరీర్ మొదలుపెట్టి చాలా సంవత్సరాలు అవుతున్నా ఆలస్యంగా, గ్లామర్ పాత్రలు చేయాలని నిర్ణయించుకుంది. కొన్ని బోల్డ్ సన్నివేశాలను కలిగి ఉన్న జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2 వంటి వెబ్ సిరీస్‌లలో కనిపించింది. లస్ట్ స్టోరీస్ 2లో తమన్నా తన, బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి రొమాంటిక్ సీన్స్ చేసింది.
స్మాల్ స్క్రీన్‌పై తన పాత్రలతో ప్రయోగాలు చేసిన ఈ నటి, ఇప్పుడు బిగ్ స్క్రీన్‌పై కూడా అలరించాలని చూస్తోంది. ఓదెలా 2ని పలు భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పార్ట్ 1 లాగానే ఇది మిస్టరీ థ్రిల్లర్‌గా ఉంటుంది. కానీ ఈ సారి దైవానికి సంబంధించిన కాన్సెప్ట్ ఉంటుందని తెలుస్తుంది. డైరెక్టర్ సంపత్ నంది ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. తమన్నా, సంపత్ నంది ఇప్పటివరకు రచ్చ, బెంగాల్ టైగర్, సీటీమర్ వంటి సినిమాలకు పనిచేశారు. మరి వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మ్యాజిక్‌ని ఇక్కడ కూడా రిపీట్ చేస్తారో లేదో చూడాలి.