»Rajinikanths Film Jailer Directed By Nelson Dilip Kumar Will Reach 300 Crores And Run Towards 400 Crores
Jailer: రూ.400 కోట్ల దిశగా రజనీకాంత్ జైలర్ మూవీ
రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల కలెక్షన్లను సాధించి రూ.400 కోట్ల దిశగా కొనసాగుతుంది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో మూవీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఈ మూవీని చూసేందుకు ఆసక్తి చూపిస్తారు.
Rajinikanth's film Jailer, directed by Nelson Dilip Kumar, will reach 300 crores and run towards 400 crores.
Jailer: కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన లేటెస్ట్ మూవీ జైలర్(Jailer Movie) ఊరమాస్ కలెక్షన్స్ తో అన్ని చోట్లా దుమ్ము లేపుతున్న విషయం తెలిసిందే. ఆగస్టు 10న విడుదల అయిన ఈ చిత్రం మొదటి నాలుగు రోజుల్లోనే కలెక్షన్ల పరంగా రికార్డు సృష్టించింది. 4వ రోజు ఆదివారం అవడంతో ఈ సినిమా అన్ని చోట్లా భారీ కలెక్షన్స్ దిశగా దూసుకెళ్తుంది. గత 5 సంవత్సరాలుగా రజనీకాంత్‌కు సరైన హిట్ లేక కలెక్షన్ల(Collections) పరంగా దారుణమైన రికార్డును మూటగట్టుకున్నారు. అయితే ఇప్పుడు వాటిన్నంటికీ చెక్ పెడుతూ నాలుగు రోజుల్లోనే రూ.300 కోట్ల గ్రాస్ వసుళ్లను రాబట్టి మరో సారి సూపర్ స్టార్ స్టామినా ఏంటో జైలర్ మూవీ చూపిస్తోంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అభిమానులకు ఓ పెద్ద బహుమతి అని చెప్పవచ్చు.
అంతేకాదు ప్రస్తుతం ఈ చిత్రం రూ.300 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటేసి ఇప్పుడు 400 కోట్ల రూపాయల దిశగా పరుగులు పెడుతుంది. రజినీ కెరీర్ లో 4వ సారి రూ.300 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమాగా ఇది నిలిచింది. 2018లో రోబో 2.0 సినిమా ద్వారా ఫస్ట్ రూ.300 కోట్ల మార్క్ గ్రాస్ ను అందుకున్న రజినీకాంత్.. కబాలి, రోబో సినిమాలతో ఆల్ మోస్ట్ రూ.300 కోట్లకు దగ్గరగా వచ్చినా కూడా ఈ మార్క్ ని అందుకోలేదు. ఇప్పుడు జైలర్ ఆ ఫీట్‌ను సాధించింది. అయితే ఆగస్టు 15 సెలవు కూడా సినిమాకు బాగా కలిసొచ్చే అవకాశం ఉంది. అయితే మరికొన్ని ఈ చిత్రం ఇంకెన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.