»Rajinikanth Will Attend Sr Ntr Birth 100th Anniversary Event 2023
Sr NTR: శతజయంతి ఉత్సవాలకు రజనీకాంత్..!
సీనియర్ నటుడు, టీడీపీ వ్యవస్థాపకుడు సీనియర్ ఎన్టీఆర్(sr Ntr) శత జయంతి ఉత్సవాల కార్యక్రమానికి ప్రముఖ తమిశ నటుడు రజనీ కాంత్(rajinikanth) హాజరుకానున్నట్లు తెలిసింది. ఈ నెల 28న ఏపీలోని విజయవాడలో ఈ వేడుకలను నిర్వహించనున్నారు.
విశ్వ విఖ్యాత నట సార్వ భౌమ, సీనియర్ నటుడు, టీడీపీ వ్యవస్థాపకుడు సీనియర్ ఎన్టీఆర్(sr ntr) శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ శతయజయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్(rajinikanth) హాజరవుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఈ నెల 28వ తేదీన విజయవాడ రానున్నారు. ఈ ఉత్సవాలను విజయవాడ శివారు పోరంకిలోని అనుమోలు గార్డెన్స్‌లో 28న సాయంత్రం 4గంటలకు నిర్వహించనున్నారు.
ఎన్టీఆర్ శత జయంతి వేడుకల కమిటీ చైర్మన్ టి.డి. జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ ఉత్సవాల్లో ముఖ్యఅతిథులుగా రజనీకాంత్‌తో పాటు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొంటారు. వీరు ముగ్గురు ఒకే వేదికను పంచుకోనున్నారు. ఎన్టీఆర్ ప్రసంగాలపై ప్రచురించిన రెండు పుస్తకాలను ఈ సభలో ఆవిష్కరించే అవకాశం ఉంది.